కరోనా కొత్త మార్గదర్శకాలు రేపు విడుదల : ప్రధాని మోదీ

VUYYURU SUBHASH
యావ‌త్ భార‌త జాతి ఊహించిన‌ట్టుగానే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసే విష‌యంలో భార‌త జాతి అంత‌టా ఏక‌తాటిపైకి వ‌చ్చి పోరాటం చేసింద‌ని మెచ్చుకున్న ఆయ‌న లాక్ డౌన్ వల్ల చాలామందికి ఇబ్బందులు పెరుగుతున్నాయని... ప్రజలు తినటానికి.. జీవించడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మోదీ తెలిపారు.

ఇక రెడ్ జోన్లు, హాట్ స్పాట్‌ల‌లో ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలను ఇస్తామని మోడీ చెప్పారు మే 3వ తేదీ వరకు మన దేశం అంతటా కొనసాగుతుందని ఆ తర్వాత కూడా కొన్ని ఆంక్ష‌లు ఉంటాయని మోడీ స్పష్టం చేశారు. మన దేశంలో మరిన్ని హాట్ స్పాట్‌లు, రెడ్ జోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... ఆహారానికి నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఇక వచ్చే వారం మన భారతదేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఈ విషయంలో భారతీయులందరూ ఎంతో జాగ్రత్తతో ఉండాలి అని చెప్పారు. ఇక క‌రోనా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు రేపు విడుద‌ల చేస్తామ‌ని మోదీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: