కరోనా వైరస్ గురించి వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 10 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వైట్ హౌస్ కు చెందిన డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కరోనా వైరస్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. 
 
త్వరగా కరోనా వ్యాధిని వ్యాక్సిన్ కనుగొనాలని... అది మాత్రమే కరోనా ముప్పును నివారించగలదని చెప్పారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు ఇప్పటికే విస్తరించింది. ఒక్కో దేశంలో కరోనా ఒక్కో దశలో ఉందని... వైరస్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని ఫౌసీ పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి చైనాలో కొత్త కేసులు నమోదు కావడం లేదని... అంత మాత్రాన చైనా కరోనాపై విజయం సాధించినట్లు కాదని పేర్కొన్నారు. 
 
గతంలో ఫౌసీ కరోనాకు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు 12 నెలల నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని చెప్పారు. ఇప్పటికే అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. కొందరు కరోనా బాధితులకు మలేరియా, హెచ్.ఐ.వీ మందులు ఇవ్వగా వారు కోలుకున్నారు. మరో అధ్యయనంలో కరోనా గాలిలో తేమ ఎక్కువగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న దేశాల్లో నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
 
3 నుండి 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని పరిశోధకులు తేల్చారు. ఉష్ణోగ్రత, వాతావరణంలోని తేమ స్థాయిలను బట్టి వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,000 మంది కరోనా భారీన పడి చనిపోగా... 13 మంది మృతి చెందారు. ఈ విశ్లేషణ ద్వారా కరోనా వ్యాప్తికి వేసవి కాలం అనుకూలం కాదని తేలింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: