ఏపీలో తొలి కరోనా మరణం.. ఒక్క రోజులోనే పోయిన ప్రాణం..?
ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తూ ప్రస్తుతం అందరినీ ప్రాణభయంతో వణికిస్తున్నది కరోనా వైరస్ . మొన్నటివరకు చైనాలో విజృంభించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారి.. ప్రస్తుతం దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో కూడా అడుగుపెట్టిన ఈ మహమ్మారి రోజురోజుకు భారత ప్రజల్లో ప్రాణాపాయాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కలకలం రేపింది. దీంతో తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కసారిగా అప్రమత్తమై పోయాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తమ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుంబిగించాయి.
ఇక ఎన్నో కఠిన నిబంధనలను కూడా తెరమీదికి తెచ్చారు. కఠిన నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రజలందరూ కరోనా వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కరోనా వైరస్ కేసు నమోదైంది. అయితే నిన్న కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి మృత్యువాత పడ్డాడు. అయితే నిన్ననే కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్సలు అందుకుంటున్న వృద్ధుడు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించడం ప్రస్తుతం అందరిలో కలవరం రేపుతోంది.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ అనుమానితుడు మరణించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లో మరింతగా ప్రాణభయం పాతుకు పోతుంది. విశాఖకు చెందిన వృద్ధుడు నిన్న తీవ్రమైన జ్వరం దగ్గు జలుబు లాంటి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరాడు.. ఇక అతను ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే ఒక్క రోజు వ్యవధిలో మృతిచెందడం ప్రస్తుతం సంచలనం గా మారిపోయింది. అయితే తెలంగాణలో ఇప్పటికే ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతి చెందగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది.