దిశ కేసులో ప్రముఖుల హస్తం... దిశ సెల్ ఫోన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్...?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల గురించి కొత్త విషయలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కేసు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకటం లేదు. ఈ కేసులో దిశ కలిసిన డెర్మటాలజిస్ట్ ఎవరు అనే వివరాలు ఇప్పటివరకు తెలియలేదు.
దిశ తన చెల్లితో మాట్లాడిన ఫోన్ కాల్ లో నిందితులు తాగినట్లు చెప్పకపోవటం గమనార్హం. మరోవైపు ఈ కేసులో నిందితులు హత్య చేసినట్లు పోలీసులు చెప్పిన ఆధారాలే తప్ప నిందితులు చెప్పినట్టు ఏ ఆధారాలు బయటకు రాలేదు. నిందితులు నలుగురిని ఎవరో ప్రముఖులు వాడుకుని ఈ హత్య చేయించారనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
మరోవైపు దిశ సెల్ ఫోన్ గురించి నవీన్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. దిశ సెల్ ఫోన్ ను పోలీసులు సంఘటన స్థలంలో దొరికిందని చెబుతున్నారని కానీ దిశ సెల్ ఫోన్ గుడిగండ్ల గుట్ట మీద దాచగా పోలీసులు సెల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారని అన్నారు. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య నిందితులు ఎదురు తిరిగారని ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారని నిందితులు ఎదురుతిరగాలనుకుంటే పోలీసులు ఊరి నుండి వారిని తీసుకెళ్లే సమయంలోనే ఎదురు తిరిగే వారని అన్నారు.
జొల్లు శివ తండ్రి మాట్లాడుతూ పోలీసులను తీసుకొని మా ఊరికి రండి... వాళ్లను నేనే చంపుతా అని అన్నారు. పోలీసులే శిక్షలు కూడా విధిస్తే కోర్టు తీర్పులు ఎందుకు...? అని శివ తండ్రి ప్రశ్నించారు. ప్రధాన నిందితుడైన అరీఫ్ గ్రామస్థులు అరీఫ్ పై గ్రామంలో ఎటువంటి ఫిర్యాదులు లేవని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం దిశ హత్య కేసు నిందితులను పోలీసులు పథకం ప్రకారమే నిందితులను ఎన్ కౌంటర్ చేశారని ఆరోపణలు చేసింది.