హెచ్1బీ గుడ్ న్యూస్... దరఖాస్తుల స్వీకరణ షురూ
అవకాశాల స్వర్గదామంగా పేరొందిన అమెరికా తాజా తన సహజ ప్రక్రికు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది.2021 సంవత్సరానికి విదేశీయులకు వీసా ఇవ్వాలనుకుంటున్న కంపెనీలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కోరింది. దీని కోసం పది డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేయనున్నారు.
ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది. అయితే ఆ వీసాలు పొందేందుకు ఎక్కువగా భారత్, చైనా దేశస్థులు దరఖాస్తు చేసుకుంటుంటారు. మనదేశం విషయానికి వస్తే...భారతీయ ఐటీ ఉద్యోగులు సాధారణంగా హెచ్1బీ వీసాలను దరఖాస్తు చేసుకుంటారు. అమెరికా కంపెనీలు ఇండియన్ టెకీలకు ఎక్కువగా ఈ వీసాలను జారీ చేస్తాయి. హెచ్-1బీ వీసాల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది.
ఇదిలాఉండగా, ఇటీవలే గ్రీన్ కార్డు నిబంధనలను అమెరికా మార్చింది. ప్రభుత్వ పథకాలను ఆసరా చేసుకునే పేదవారికి గ్రీన్‌కార్డు ఇవ్వకూడదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఉత్తర్వుతో పేదలకు అనుహ్యమైన షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. ఇదే సిద్ధాంతం అమెరికాలోనూ ఉన్నది. కానీ ఆ దేశానికి వలస వస్తున్నవారి సంఖ్య అదుపు తుప్పుతున్నది. ఆ ఉపద్రవాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. దానికి కొనసాగింపుగా...పేద వలసలకు గ్రీన్‌కార్డు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇది నిజంగా పెద్ద షాక్. ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, కరీబియన్ దీవుల ప్రజలకు శరాఘాతంగా మారింది. ఈ నిర్ణయంతో భారతీయులు సైతం పెద్ద ఎత్తున ప్రభావితం అయ్యారు. లీగల్ వీసా ఉండి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నవారిలో సుమారు 2.6 కోట్ల మంది వలస ప్రజలు ఉంటారని అక్కడి ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కొత్త నియమం ప్రకారం వాళ్లంతా తమ ఇమ్మిగ్రేషన్ స్టాటస్‌ను మరోసారి సమీక్షించుకోవాల్సి ఉంటుంది. పౌర హక్కుల సంఘాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని హేయమైన చర్యగా ఆరోపించాయి.