టీడీపీ సీనియర్ నేత, నటుడు ఎన్.శివ ప్రసాద్ ఇకలేరు..!

shami
టీడీపీ మాజీ ఎంపి, సిని నటుడు ఎన్.శివ ప్రసాద్ కొద్దిసేపతి క్రితం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న శివ ప్రసాద్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పొట్టపల్లిలో జన్మించిన శివ ప్రసాద్ తిరుపతి ఎస్వి కళాశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు.


స్వతహాగా రంగస్థల నటుడైన శివ ప్రసాద్ ఎన్నో వేదికలపై ప్రదర్శనలు చేశారు. రంగస్థలం నుండి సినిమాల్లో ఛాన్సులు అందుకున్న శివ ప్రసాద్ క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చాల సినిమాల్లో నటించారు. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు శివ ప్రసాద్.


నటుడిగా ఉంటూనే రాజకీయాల మీద ఆసక్తితో తెలుగు దేశం పార్టీలో చేరిన శివ ప్రసాద్ 1994-2004 ల మధ్య సత్యవేడు ఎమ్మెల్యేగా చేశారు. 1999-2001 కాలంలో  రాష్ట్ర సమాచార సాంస్కృతిక శాఖా మంత్రిగా పనిచేశారు. 2009, 2014 చిత్తూరు లోక్ సభ స్థానం నుండి బరిలో దిగి రెండు సార్లు ఎంపిగా గెలిచారు శివ ప్రసాద్. 


శివప్రసాద్ అంటే రాజకీయవేత్త మాత్రమే కాదు సినిమా నటుడనే గుర్తుకు వచ్చేలా చేస్తున్న పోరాట ఏదైనా ప్రభుత్వం తరపున ఆయన వేసుకునే వేషధారణ అందరికి ఆకట్టుకునేలా ఉండేవి. కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలన్న ఉద్దేశంతో ఆయన వేసిన వేష ధారణ అనదరిని ఆకట్టుకుంది. శివ ప్రసాద్ మరణ వార్త విని సిని పరిశ్రమ కూడా షాక్ అయ్యింది. తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఈమధ్యనే కోడెల మరణం జీర్ణించుకోకముందే ఈరొజు శివ ప్రసాద్ దూరమవడం చంద్రబాబుకి షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఈమధ్యనే కోడెల మరణం జీర్ణించుకోకముందే ఈరొజు శివ ప్రసాద్ దూరమవడం చంద్రబాబుకి షాక్ ఇచ్చింది. సినిమా పరిశ్రమకు కూడా శివ ప్రసాద్ ఎంతో కావాల్సిన వారు ఆయన మరణ వార్త విన్న సిని పెద్దలు తమ ప్రగాడ సానుభూతి అందచేస్తున్నారు.
   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: