ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విలన్ గా ఎన్టీఆర్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ లో హీరో యాంగిల్ ఏ కాకుండా నెగటివ్ యాంగిల్ కూడా ఉంది.అది ఎలా ఉంటుందో జై లవకుశ సినిమాలో మీరు చూసే ఉంటారు.ఇక ఆ సినిమాలో జై పాత్రలో విధంగా తన సత్తా చాటాడు జూనియర్ ఎన్టీఆర్. పాజిటివ్ షేడ్స్ ఉన్న హీరో అని కూడా  చూయించాడు. అయితే తాజాగా మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ తనలో ఉన్న నెగిటివ్ షేడ్ ని చూపించబోతున్నాడట. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో  కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

ఇక అది కూడా టాలీవుడ్ లో కాదు. బాలీవుడ్ లో విలన్ గా తన సత్తా చాటుబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ ఎస్ రాజ్ ఫిలిమ్స్ స్పై ఫ్రాంచైజ్ లొనే వార్ సినిమాకి సీక్వెల్ గా వార్ టు సినిమా త్వరలోనే రాబోతుంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ మరియు రుతిక్ రోషన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్క బోతుంది. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. దాంతోపాటు ఆయన పాత్ర నెగిటివ్గా ఎందుకు మారుతుంది అనే దానికి ఒక బలమైన కారణం కూడా ఈ సినిమాలో ఉంటుందట.

ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉండేలా అయాన్ ముఖర్జీ ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల పాత్ర కోసం దీపికా పదుకొనే శర్వరి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించేలా సన్నాహాలు చేపడుతున్నారు. అదిలా ఉంటే ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్   ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: