అమరావతి :​ పవన్ ఇక సీఎం అయినట్లే

Vijaya
శ్రీకాకుళం జిల్లాలోని రణస్ధలంలో జరిగిన జనసేన బహిరంగసభతో ఒక విషయం స్పష్టమైపోయింది. ఇంతకీ అదేమిటంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. ఇంతకాలం వచ్చేఎన్నికల్లో పోటీచేసే విషయంలో దాగుడుమూతలాడిన పవన్ చిట్టచివరకు ఆ విషయాన్ని తేల్చేశారు. తెలుగుదేశంపార్టీతో  పొత్తు పెట్టుకునే వచ్చేఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు చెప్పేశారు. కాకపోతే దానికి గౌరవ, మర్యాదలకు లోటులేకపోతే అని షుగర్ కోటింగ్ తగిలించారు.  గౌరవ, మర్యాదంటే ఏమిటో మాత్రం పవన్ వివరించలేదు.
పవన్ చెప్పిన మాటకు అర్ధమేమిటంటే తాము అడిగినన్ని సీట్లను చంద్రబాబునాయుడు ఇస్తే గౌరవమర్యాద దక్కినట్లు అని అనుకోవాలి. ఎప్పుడైతే చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారో అప్పుడే జనసేన గౌరవ, మర్యాద పోయింది. ఎందుకంటే అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలనే బలమైనకోరిక చంద్రబాబులోనే ఉంది. వచ్చేఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే భవిష్యత్తులో టీడీపీ అనేది ఉండదనేది చంద్రబాబు భయం. అలాగే  కొడుకు లోకేష్ భవిష్యత్తు అంథకారమైపోతుంది.ఇదేసమయంలో పవన్ కు ఈ సమస్యలేదు. రాజకీయాలు కాకపోతే ఎంచక్కా సినిమాలు చేసుకుంటారు. ఇలాంటినేపద్యంలోనే పార్టీలోని కొందరు పొత్తుల విషయంలో తొందరపడద్దని పవన్ కు చెప్పారట. పొత్తుకోసం చంద్రబాబు జనసేన దగ్గరకు వచ్చినపుడు సీట్ల విషయంలో బేరమాడచ్చని  అప్పుడు అడిగినన్ని సీట్లు దక్కే అవకాశాలున్నాయని చెప్పారట. అయితే పవన్ ఆ సలహాలను పట్టించుకోకుండా తనంతట తానుగానే పొత్తు విషయం ప్రస్తావించారని తెలుస్తోంది.దీనివల్ల ఇప్పుడేమైందంటే పవన్ కు సీట్ల విషయంలో బేరాలడే అవకాశంపోయింది. ఇదే సమయంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లే. మేజర్ పార్టనర్ గా సీఎం కుర్చీలో చంద్రబాబు కూర్చుంటారే కానీ మైనర్ పార్టనర్ పవన్ కు అవకాశం ఇవ్వరు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒంటరిపోరాటానికి పవన్ భయపడుతున్నారనే విషయం అందరికీ అర్ధమైపోయింది. అంటే ఒంటరిగా పోటీచేస్తే గెలవలేరు, పొత్తు పెట్టుకుంటే  సీఎం కాలేరు. పొత్తుల్లో పవన్ కు ఏపాటి గౌరవ, మర్యాదలు దక్కుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: