అమరావతి : అందరి దృష్టి బీజేపీ పైనేనా ?

Vijaya





శ్రీకాకుళం జిల్లా రణస్ధలం బహిరంగసభలో జనసేన అధినేత చేసిన ప్రకటన తర్వాత ఇపుడందరి దృష్టి బీజేపీపైన పడింది. బహిరంగసభలో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో టీడీపీతో పొత్తుంటుందని తేల్చేశారు. జనసేన  ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని కూడా చెప్పారు. ఒంటరిగా పోటీచేసి వీరమరణం పొందే బదులు టీడీపీతో పొత్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న తన ఆలోచనను బయటపెట్టారు. పవన్ చెప్పిన గౌరవ, మర్యాదల విషయాన్ని పక్కనపెట్టేస్తే పొత్తుతోనే పోటీచేయటం ఖాయమని తేల్చేశారు.



కాబట్టి ఇపుడు పొత్తుల బాల్ బీజేపీ కోర్టులో పడింది.  బీజేపీ, జనసేన మిత్రపక్షాలన్న విషయం తెలిసిందే. ఒకవైపు బీజేపీతో ఉంటునే మరోవైపు చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలను కమలనాదులు గమనిస్తునే ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో పవన్ను నియంత్రించలేక అలాగని పవన్ ప్రయత్నాలను ఆమోదించలేక బీజేపీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ అడుగులు అర్ధమవుతున్నా పైకి మాత్రం తమ రెండుపార్టీలే కలిసిపోటీచేస్తాయని ప్రకటించుంకుంటున్నారు.



ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపెట్టుకునేట్లుగా బీజేపీని ఒప్పిస్తానని పవన్ చెప్పినప్పుడల్లా చంద్రబాబుతో చేతులు కలిపేదిలేదని బీజేపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అయితే రణస్ధలంలో టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు పవన్ ప్రకటించేశారు. మరిపుడు బీజేపీ ఏమిచేస్తుంది ? ఇంతకాలం పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు వెనకాడిన పవన్ ఇపుడు ఓపెన్ అయిపోయారు. మరిపుడు కూడా కమలనాదులు ఇంకా పవన్ తోనే తమ పొత్తని నెట్టుకుంటూ వస్తారా ?



ఎందుకంటే పవన్ అడుగులు ఎటో తేలిపోయిన తర్వాత ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ మాత్రమే. తమను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళటానికి రెడీ అయిన పవన్ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది. బీజేపీని వదిలేయటానికి రెడీ అయిన పవన్ కే కాదు పవన్ తో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబుకు కూడా ఇది సమస్యే. ఎలాగంటే ఇతర రాష్ట్రాల్లో తమను వదిలేసిన పార్టీల విషయాన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకున్నది. మరి ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లానేంటో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: