పవన్ సీఎం అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా ?

VAMSI
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్యన కీలక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపైన నిన్నటి నుండి రాజకీయ వర్గాలలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు పొత్తు గురించి తీసుకువస్తూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఆంద్రప్రదేశ్ లో టీడీపీ మరియు జనసేనలు కలిసి ప్రజాబలం ఉన్న వైసీపీని 2024 లో ఢీ కొట్టనున్నాయి. అయితే ఇప్పుడే అసలు సిసలైన అగ్నిపరీక్ష మొదలు కానుంది. టీడీపీ మరియు జనసేనలు కలిసి పోటీ చేస్తే.. ఏపీలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలను ఏ విధంగా పంచుకుంటాయన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు పార్టీలు సీట్ లను పంచుకునే క్రమంలో మనస్పర్థలు, చిన్నపాటి వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉన్న సీట్ లలో ఎవరు ఎన్ని తీసుకుంటారు అన్న విషయంలో ఒక సమీకరణం మాత్రం ప్రచారంలో ఉంది. టీడీపీ 100 మరియు జనసేన 75 సీట్లలో పోటీ చేస్తుందట. కానీ గతంలో టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలు బీజేపీ మరియు కమ్యూనిస్ట్ లకు ఇన్ని సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ జనసేన పరిస్థితి తీసుకుంటే బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉండడం మరియు కమ్మ సామాజికవర్గం అంతా పవన్ వైపే ఉండడం మరియు కొంత స్థాయిలో యువకులు వెన్నంటే నిలబడి ఉండడం వంటి కారణాల చేత ఇన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా జనసైనికులు పొత్తు పెట్టుకుని టీడీపీకి మద్దతును ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. సీట్ల వరకు అయితే ఓకే కానీ... సీఎం అభ్యర్థి విషయంలో అపరచాణక్యుడు చంద్రబాబు ఒప్పుకుంటాడా ? రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న ప్రకారం చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నికలు అయితే సీఎంగా తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని ముగించాలని అనుకుంటున్నాడట. మరి ఈ సీఎం చైర్ కుమ్ములాటల్లో పవన్ చంద్రబాబు లలో ఎవరిది పైచేయి అవుతుంది చూడాలి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: