వైసీపీ "గడప గడపకు మన ప్రభుత్వం" రిజల్ట్ ఏంటో ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన పై మిశ్రమ స్పందన వస్తోంది. కానీ రాజకీయాలలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఎంత బాగా పాలన సాగించినా ప్రతిపక్ష పార్టీ మాత్రం సరిగా చేయలేదనే చెబుతూ ఉంటుంది. ఇక పాలన బాగాలేకపోయినా అధికార పార్టీ నేతలు చాలా బాగుంది మా పాలన అని చెప్పుకోవడం పరిపాటి. అయితే పాలన బాగుందా లేదా అన్నది సరైన రుజువు కావాలంటే మాత్రం తర్వాత జరగనున్న ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం కోసం రాష్ట్రంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్ మరియు మాజీ సీఎం చంద్రబాబులు ఈ తీర్పు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నికల గురించి జగన్ మనసులో ఏ విధమైన అనుమానం లేదు. ఇటీవల జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మళ్ళీ అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు. మెజారిటీని గతంలో కన్నా పెంచుకోవడానికి జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలను ప్రజల వద్దకు వెళ్లి తమ ప్రభుత్వం పెట్టిన పధకాలు వస్తున్నాయా లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోమని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది కనుక అనుకున్న విధంగా జరిగితే మనకు ఖచ్చితంగా గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడుతున్నారు.
కానీ ఈ కార్యక్రమం గురించి వస్తున్న అవుట్ ఫుట్ ప్రకారం చూస్తే ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపుగా 20 మందికి పైగా అస్సలు ప్రజల వద్దకు వెళ్లలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. జగన్ కూడా వీళ్లపై సీరియస్ గానే ఉన్నాడట , వచ్చే ఎన్నికల్లో టికెట్ లు కూడా ఇవ్వబోడని ప్రచారంలో ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: