చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు కానున్నాయా ?

VAMSI
టీడీపీకి రెండవ అధ్యక్షుడిగా నియమితులైన నారా చంద్రబాబునాయుడు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయంగా ఎంతో పరిణితి చెందాడు. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది రాజకీయాలలో ఉన్న వారు కావొచ్చు లేదా కొత్తగా రాజకీయాలకు రావాలనుకుంటున్న యువత కావొచ్చు ఈయనను ఆదర్శంగా మరియు స్ఫూర్తిగా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇలా చాలా మందికి ఆదర్శంగా మారడానికి కారణం ఆయన దూరదృష్టి, విషయం పరిజ్ఞానం, ఆలోచనా విధానం, డెసిషన్ మేకింగ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎన్నో లక్షణాలు కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారన్న ప్రచారం తెలుగు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కానీ ప్రస్తుతం ఉన్న వస్తావా పరిస్థితుల దృష్ట్యా చూస్తే కూడా ఇదే కరెక్ట్ అని తెలుస్తోంది. చంద్రబాబుకు వయసు మీద పడడం మరియు తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ను అన్ని విధాలుగా సిద్ధం చేస్తుండడం వంటి కొన్ని కారణాలు ఆయన రాజకీయాలకు స్వస్తి పలకనున్నాడని చెబుతున్నాయి. అందుకే ఈ ఎన్నికను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ వయసులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నియోజకవర్గాలలో వెళ్లి బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. సభలకు అయితే జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారని టీడీపీ వర్గాలు డబ్బా కొట్టుకుంటున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కనుక టీడీపీ గెలిచి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్రతిపక్షములో ఉండడానికి ఖచ్చితంగా ఇష్టపడడు. ఇంట్లో అయినా ఉంటాడు..
అందుకే ఈ ఎన్నికలను టీడీపీ మద్దతుదారులు అంతా కూడా గట్టిగా తీసుకుంటున్నారు. వైసీపీ కూడా వరుసగా రెండవసారి 2024 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఓడించి రాజకీయాలకు దూరం చేయాలని పట్టుదలతో ఉన్నారు. మరి ఆఖరి సమరంలో గెలుపెవరిది ? చంద్రబాబుకు కీలకం అయిన ఈ ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరో సంవత్సరం మూడు నెలలు వేచిచూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: