2024 లో టీడీపీకి దక్కే సీట్లు ఎన్ని ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు వరకు జరిగిన ఎన్నికలు అన్నీ ఒక ఎత్తు అయితే... మరో సంవత్సరం మూడునెలల్లో జరగబోయే ఎన్నికలో మరో ఎత్తు అని చెప్పాలి. ఈ ఎన్నికలో వచ్చే ఫలితంతో కొందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు కు వయసు మీద పడుతోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చూస్తే ఈ ఎన్నికల తర్వాత ఇంటికి పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ ప్రముఖులు సైతం చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత సరైన నాయకుడు కూడా టీడీపీకి లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి.
ఇప్పటికీ ఎప్పటికీ రాజకీయాలతో సంబంధం లేకుండా చంద్రబాబును అభిమానించే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రాజకీయాల్లో లేకపోతే పార్టీని మరియు నాయకులను కలుపుకుని పోయే సమర్ధుడైన నాయకుడు లేడు. ఈ ఎన్నికలలో గెలిస్తే సీఎం అయి ఆఖరిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలో ఉండాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. అయితే అందుకు చాలా విషయాలు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కి ఎందుకు ఓటు వేయకూడదు అని చెప్పడానికి పెద్ద కారణాలు ఏమీ లేవనేది పార్టీ అభిప్రాయం. ఇక సంక్షేమ పధకాల వలన ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు లబ్ది పొందారు.
వైసీపీని ఓడించాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి సాధ్యపడన్నది రాజకీయ ప్రముఖులు అంటున్న మాట. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అందులో ఒక 20 నుండి 30 సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి తప్పించి, ఓటమి వైసీపీ చెంతకు చేరదు అని ప్రజాభిమానం చెబుతోంది. ఆ లెక్కన చూసుకుంటే జనసేనతో సంబంధం లేకుండా టీడీపీ పోటీ చేస్తే 70 సీట్ల వరకు పొందే అవకాశం ఉందన్నది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: