మీటింగ్ లకు వచ్చినోళ్ళు టీడీపీకి ఓటేస్తారా చంద్రబాబు ?

VAMSI
ఏపీ మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రీసెంట్ గా కండక్ట్ చేసిన బహిరంగ సభల గురించి పొలిటికల్ వర్గాల్లో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రెండు విధాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఒక విషయం టీడీపీకి పాజిటివ్ గా ఉంటే మరొక అంశం మాత్రం నెగటివ్ అని చెప్పాలి. గత వారంలో జరిగిన కందుకూరు సభకు ప్రజలు బాగా వచ్చారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కానీ వేల సంఖ్యలో ప్రజలు వచ్చినా... అక్కడ దారులు కూడా ఇరుకుగా ఉండడంతో అంతమంది ఉండే అవకాశం లేదు... టీడీపీ ప్రచారం కోసం తప్పుడు లెక్కలు చెప్పుకుంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇక అక్కడ దారులు సైతం ఇరుకుగా ఉండడంతో తోపులాట మరియు తొక్కిసలాట జరగడంతో మీటింగ్ కి వచ్చిన 8 మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు,  మరి కొంతమంది గాయాల పాలయ్యారు. ఈ విషయం గురించి మరచిపోక ముందే ఆదివారం రోజు సాయంత్రం గుంటూరు లో మరో సభ జరిగింది. అయితే దీనికి చంద్రన్న సంక్రాంతి కానుక అని పేరు పెట్టి ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా పంచి పెట్టారు. అయితే చంద్రబాబు దురదృష్టమో లేదా నిర్వాహక తప్పిదాలు అన్నది తెలియదు.. కానీ ఈ సభలోనూ తొక్కిసలాట జరిగి 3 మహిళలు చనిపోవడం జరిగింది. ఇక వైసీపీ లీడర్స్ చంద్రబాబు సభకు ప్రజలు వెళితే మరణమేనా అన్న రీతిలో విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... చంద్రబాబు ఎక్కడ సభలు పెట్టినా జనం తండోపతండాలుగా వస్తున్నారని, ప్రజల్లో టీడీపీకి మైలేజ్ బాగా పెరిగిందని వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి రాజకీయ ప్రముఖులు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు. రాజకీయ సభలు ఎవరు పెట్టినా వెళ్తారు... ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటారు. ఈ రోజు లక్షల మంది సభలకు హాజరు అయినంత మాత్రాన వారంతా ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు అని చురకలు అంటించారు. ఈ విషయం ఒకింత సంతోషం మరియు బాధని కలిగిస్తోంది. మరి ముందు ముందు టీడీపీ అండ్ కో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: