అమరావతి : ఎల్లోమీడియాకు ‘ఇదేంఖర్మ’ ?

Vijaya


చంద్రబాబునాయుడు పాల్గొంటున్న ఇదేంఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమాలను కవర్ చేయటానికి ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది. కారణం ఏమిటంటే నాలుగురోజుల వ్యవధిలో రెండు కార్యక్రమాల్లో 11 మంది చనిపోవటమే. మొదట నెల్లూరు జిల్లా కందుకూరులో తొక్కిసలాట కారణంగా 8 మంది చనిపోగా తాజాగా జనవరి 1వ తేదీన గుంటూరులో ఇదే కార్యక్రమంలో మరో ముగ్గురు చనిపోయారు. ఈ రెండుకూడా చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాలే కావటం గమనార్హం.



ఇపుడు చంద్రబాబు కార్యక్రమం అంటేనే  మామూలు జనాలంతా ఇదేం ఖర్మ మాకు అని నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఇంతకీ కార్యక్రమం కవరేజీలో ఎల్లోమీడియా అవస్తలు ఏమిటంటే గుంటూరు తొక్కిసలాట ఘటనకు టీడీపీకి సంబంధమే లేదన్నట్లుగా కవరేజిలో నానా అవస్తలుపడింది. తొక్కిసలాట ఘటన తీవ్రతను చాలా తక్కువచేసి చూపించేందుకు చాలా ఇబ్బందిపడింది.  ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారని చెప్పింది.



అయితే అసలు విషయం ఏమిటంటే కార్యక్రమం ఉయ్యూరు ఫౌండేషన్ దే కానీ సదరు నిర్వాహకుడు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో చాలా యాక్టివ్ గా ఉంటారట. అంటే ఈ కార్యక్రమం కూడా టీడీపీ ఆధ్వర్యంలో జరిగిందే. పైగా కార్యక్రమం నిర్వహణను టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు రెగ్యులర్ గా పర్యవేక్షించారు. ఘటనలో తొక్కిసలాట జరగకపోయుంటే చంద్రబాబు ప్రసంగాన్ని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసుండేవారు. కానీ తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవటంతో కార్యక్రమానికి టీడీపీకి సంబంధమే లేదన్నట్లు కవర్ చేశారు. కవరేజీ కూడా బ్యానర్ గా కాకుండా లోపలపేజీల్లో ఇచ్చారు.



తొక్కిసలాట నిర్వాహకుల తప్పువల్ల జరిగితే దీన్ని కూడా పోలీసుల ఖాతాలోనే వేసేసింది ఎల్లోమీడియా. కార్యక్రమానికి కేటాయించిన 200 మంది పోలీసులు సరిపోలేదని ఇతర జిల్లాల నుండి ఇంకా ఎక్కువమందిని తెప్పించుంటే తొక్కిసలాట జరిగుండేదికాదని ఎల్లోమీడియా తెగబాధపడిపోయింది. చంద్రబాబు కొంతమందికి కిట్లుపంపిణీ చేసి వెళిపోగానే నిర్వాహకులు కిట్లపంపిణీని ఆపేశారు. అందరికీ పంపిణీ చేయటానికి సరిపడా లేవుకాబట్టి ఆదివారం కొందరికిచ్చి మిగిలిన వాళ్ళకు సోమవారం ఇస్తామని చెప్పటంతోనే జనాలు ఎగబడ్డారు. దీన్నికూడా లబ్దిదారుల తప్పన్నట్లుగా కవరింగ్ ఇచ్చుకుంది. మొత్తానికి చంద్రబాబు పాల్గొన్న రెండువరుస కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోవటాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: