"మహాసేన" రాజేష్ కు జనసేన ఎమ్మెల్యే టిక్కెట్ ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఊహించని ఎన్నో మార్పులు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. వైసీపీ సంక్షేమంలో ముందు ఉండగా , అభివృద్ధి మరియు ఇతర విషయాలలో వెనుకంజలో ఉంది అన్న పేరును మూటగట్టుకుంది. ఈ కారణం వలన రానున్న 2024 ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ సీట్లు తగ్గే ప్రమాదంలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీకి ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చని మరికొందరు తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. అయితే వైసీపీ, టీడీపీ ల తర్వాత ప్రాధాన్యత సంతరించుకుంటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే... అది పవన్ కళ్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీ అని చెప్పాలి.
పార్టీని స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పైన కావస్తున్నా ఇంకా సరైన మద్దతును ప్రజల నుండి పొందడంలో జనసేనాని వెనుకబడ్డాడు మరియు విఫలం అవుతున్నాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముందుగా పార్టీకి ఒక బేసిక్ గ్రౌండ్ రూల్స్ లేకపోవడమే పెద్ద సమస్యగా మారిందని రాజకీయ పెద్దలు అంటున్నారు. గత ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన చేసిన జనసేన... వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇక ఎన్నికలకు సంవత్సరం మూడు నెలల సమయం మాత్రమే ఉండగా జనసేన తరపున పోటీ చేయనున్న ఎమ్మెల్యే మరియు ఎంపీల లిస్ట్ ను రెడీ చేసే పనిలో జనసేన వర్క్ అవుట్ చేసే పనిలో ఉన్నారట.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జనసేన కొందరిని ఆల్రెడీ నియోజకవర్గాల తో పాటు ఫైనల్ చేశారట. కాగా ఇపుడు సరికొత్త అప్డేట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహాసేన అనే ఒక సంఘానికి అద్యక్షుడిగా ఉన్న రాజేష్ ఇప్పటికే పవన్ యొక్క భావాలు తెలుసుకుని జనసేనను మద్దతు పలుకుతూ వస్తున్నాడు. ఇక వైసీపీ మీద అగ్గిలం మీద గుగ్గిలంలా పడుతూ వారి అన్యాయాలను ఎదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం మనము చూస్తున్నాము. అలా అన్ని విషయాలు కలిసి వచ్చి మహాసేన రాజేష్ కు జనసేన తరపున ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారని వినికిడి. అయితే నియోజకవర్గం ఏది అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: