గోదావరి : కాపులను జగన్ ఎలా ఎదుర్కొంటారు ? వెరీ ఇంట్రెస్టింగ్

Vijaya




కాపులకు 5 శాతం రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండుతో సీనియర్ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సోమవారం నుండి నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. జోగయ్య దీక్షపై నిరవధిక దీక్షని, ఆమరణ నిరాహారదీక్షని రెండు రకాలుగా ప్రచారం జరుగుతోంది. రెండూ ఒకటే అయినా అసలు జోగయ్య దీక్షకు దిగటమే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ మాజీ ఎంపీ వయసు సుమారు 87 ఏళ్ళు.




ఈ వయసులో జోగయ్యకు బీపీ, షుగర్ లాంటివి ఉండే అవకాశాలున్నాయి. దీక్ష మొదలుపెట్టగానే అనారోగ్యం పాలైతే బాధ్యత ఎవరు తీసుకుంటారు ? రోజువారి వేసుకోవాల్సిన మందులు ఏవో ఉండే వుంటాయి. ఆ మందులను టైం ప్రకారం వేసుకోకపోతే సమస్య పెరిగిపోతుంది. సరే జోగయ్య విషయం పక్కనపెట్టేస్తే ఈ దీక్షతో ఏమో అయిపోతుందని కాదుకానీ కొంత కదలిక అయితే వస్తుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే అగ్రవర్ణాల్లో పేదలకు (ఈడబ్ల్యూసీ) 10 శాతం రిజర్వేషన్ అమలు రాష్ట్రప్రభుత్వాల ఇష్టమే అని కేంద్రం తేల్చిచెప్పేసింది.



ఈ నేపధ్యంలోనే రిజర్వేషన్లపై కాపుల్లో  మళ్ళీ డిమాండ్లు మొదలవ్వగానే జోగయ్య వెంటనే జగన్ కు లేఖరాసేసి దీక్ష చేయబోతున్నట్లు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. మరిపుడు కాపుల రిజర్వేషన్ డిమాండ్లను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారు ? రిజర్వేషన్ అమలుచేస్తారా ? లేకపోతే పక్కనపడేస్తారా ? అన్నది ఇంట్రెస్టిగ్ పాయింట్ అయిపోయింది.




రిజర్వేషన్ అమలుచేస్తే దాన్ని చంద్రబాబునాయుడు తన ఖాతాలో వేసుకుంటారు. ఎందుకంటే ఈబీసీ 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించింది చంద్రబాబే కాబట్టి. అప్పట్లో కేటాయించినా అమలులో ఫెయిలయ్యారు. ఒకవేళ అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇదే విషయమై జగన్ వ్యతిరేకత ఎదుర్కోక తప్పదేమో. అప్పుడు కూడా జగన్ను, చంద్రబాబు కార్నర్ చేసేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో ఈబీసీ రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్రం నుండి క్లారిటి రావటానికి తామే కారణమని బీజేపీ ఇప్పటికే డప్పుకొట్టుకుంటోంది. మరీ పరిస్దితుల్లో జగన్ ఏమిచేస్తారు ?








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: