ఎన్నికల ముందు జగన్ ముందు కఠిన సవాళ్లు ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల తర్వాత ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నేత నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు. ఇక తండ్రి మరణం తర్వాత కొత్త రాజకీయ పార్టీని స్థాపించి రెండవ ధపా ఎన్నికలలో పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొంది జగన్ ఏపీకి సీఎం అయ్యాడు. ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా సంక్షేమ పధకాలను ప్రజల వద్దకు నేరుగా చేర్చడంలో సీఎం జగన్ సఫలీకృతుడయ్యాడు అని గర్వంగా చెప్పవచు. ఇంతకు ముందు ప్రభుత్వాల్లా కాకుండా నేరుగా అధికారులే ఇంటి వద్దకు వచ్చి వారికి అందించడం గొప్ప విషయంగా ప్రజలు చెప్పుకుంటున్నారు.
అక్కడే జగన్ ఒక సీఎం గా సక్సెస్ అయినట్లు. కాగా మరో సంవత్సరం నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత ఎన్నికల లాగా ఈ సారి అంత సులభంగా విజయం దక్కడం కష్టమే అని సర్వేలు కూడా చెప్పేశాయి. ఇక మరికొన్ని సర్వేలు అయితే జగన్ గెలవడం కష్టమేనని అంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించి ఎన్నికల్లో గెలిపించడానికి జగన్ కొన్ని సవాళ్ళను అదిగిమయించక తప్పేలా లేదు.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుండి గట్టి పోటీ ఎదురవుతుందని తెలుస్తోంది, ఇందుకు కారణం రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ మీద నెలకొన్న వ్యతిరేకత కారణం అని చెప్పాలి. ఈ వ్యతిరేకతను అధిగమించుకుంటూ పార్టీకి ప్రజల్లో పోజిటివిటీ పెంచాలి.
ఇక జనసేన మరియు బీజేపీ ల నుండి కాస్తయినా ప్రతిఘటన ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. జనసేన పొత్తు ఎవరితో పెట్టుకుంటుంది అన్న విషయాన్ని పక్కన పెడితే , ఒంటరిగా పోటీ చేసినా పవన్ కు ఉన్న హవాకు సీట్లు రాకపోయినా ఓట్లు పడే అవకాశం ఉంది. పది లోపు సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే జనసేనకు ఓట్లు చీలకుండా ముందస్తు జాగ్రత్తకు తీసుకోవాలి.
ఇక అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం సొంత గూటిలో ఉన్న పక్షులతోనే ప్రమాదం పొంచి ఉండడం, ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు మరియు నేతలలో అసంతృప్తి నెలకొందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయానికి వీళ్ళు ప్లేట్ ఫిరాయిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇలా ఎన్నికల ముందు జగన్ ముందున్న సవాళ్ళను ఎలా అధిగమిస్తాడు అన్నది చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: