ఉత్తరాంధ్ర : కాపునాడు సభకు ప్రముఖుల షాక్ ?

Vijaya






కాపుసంఘాల్లో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.  విశాఖ నగరంలో కాపునాడు ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. ఎన్నికలకు ముందు అందులోను అగ్రవర్ణాల్లోని పేదలకు (ఈడబ్ల్యూసీ) 10 రిజర్వేషన్ కేటాయింపు రాష్ట్రాల ఇష్టమే అని కేంద్రం తేల్చేసిన నేపధ్యంలో బహిరంగసభ జరుగుతోంది. పై రెండు అంశాల నేపధ్యంలో బహిరంగసభ జరగబోతోంది కాబట్టి ప్రభుత్వానికి వార్నింగులు గట్రా ఉంటుందని చాలామంది ఏదేదో ఊహించేసుకున్నారు.



తీరాచూస్తే అంత సీన్ లేదని ఇన్నర్ సర్కిళ్ళల్లో టాక్ నడుస్తోంది. కాపునాడు బహిరంగసభంటే ముందు అందరి దృష్టి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుపైన నిలిచింది. అయితే ఆయన వ్యక్తిగతపనుల పేరుతో హైదరాబాద్ లో ఉండిపోయారట. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభ కూడా హాజరుకాలేదు.  పోనీ కాపునాడు పోస్టర్లలో చిరంజీవితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటో ఉంది కాబట్టి హాజరయ్యారా అంటే కాలేదు. కాపునాడు అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం కూడా వైజాగ్ చేరుకోలేదు.



ఇదే సమయంలో కాపులకు ప్రత్యేకంగా పార్టీ పెట్టాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఆరేటి ప్రకాష్, తమిళనాడు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, ఏపీ డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు లాంటి వాళ్ళు కూడా యాక్టివ్ గా కనబడలేదు. కాపునాడు బహిరంగసభను సక్సెస్ చేసే బాధ్యతను ఎవరిపైన మోపారో అదీ తెలీటంలేదు.



కాపులకు రిజర్వేషన్ డిమాండుతో నిరాహార దీక్షకు రెడీ అవుతున్న హరిరామజోగయ్య వైజాగ్ సభకు హాజరవ్వలేదు. మరి ప్రముఖుల్లో చాలామంది బహిరంగసభకు దూరంగా ఉండేటపుడు అసలు బహిరంగసభ నిర్వహణ ఎందుకోసం ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. మొత్తానికి బహిరంగసభ నిర్వహణ పుణ్యమా అని కాపు ప్రముఖుల్లోని విభేదాలు బయటపడ్డాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. బహిరంగసభకు వైసీపీ, టీడీపీల్లోని కాపు ప్రముఖులు కూడా హాజరుకాలేదు.  పార్టీపరంగా సామాజికవర్గంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతోనే ప్రజాప్రతినిదులు హాజరుకాలేదని సమాచారం.  బీజేపీ నేతలు మాత్రం హాజరయ్యారు. బహిరంగసభ నిర్వహణలోనే ఇన్ని విభేదాలున్నపుడు ఇక కాపులకు రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుంది ? అసలు ఎప్పటికైనా సాధ్యమవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: