గోదావరి : జగన్ కు డేంజర్ బెల్స్ మొదలయ్యాయా ?

Vijaya

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మొదలయ్యాయి.  కాపు రిజర్వేషన్ అమలు చేయాలనే డెంజర్ బెల్స్ మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య రూపంలో మోగింది. ఈనెల 31వ తేదీలోగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని జగన్ కు రాసిన లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం కాపు ఉద్యమాలకు పేటెంట్ మరో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంకు మాత్రమే ఉండేది.



అలాంటిది ముద్రగడ మౌనంగా ఉన్నారనే కారణంగానో ఏమో సడెన్ గా జోగయ్య సీన్లోకి ఎంటరయ్యారు. అదికూడా 86 ఏళ్ళ వయసులో నిరాహారదీక్ష చేస్తానని జోగయ్య బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం కాపుల సంక్షేమం పేరుతో  జోగయ్య ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటిది హఠాత్తుగా నిరాహార దీక్ష అని ప్రకటించారంటే వెనక ఇంకా ఎవరో ఉన్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొదటినుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జోగయ్య మద్దతుదారుగా ఉన్నారు. అసలు 86 ఏళ్ళ వయసులో నిరాహార దీక్షకు దిగుతానని జోగయ్య బెదిరించటమే విచిత్రంగా ఉంది. 



సో, ఇపుడు కూడా జోగయ్య నిరాహారదీక్ష బెదిరింపుల వెనుక జనసేన ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన ఉందా లేదా అన్నది పక్కనపెట్టేస్తే  ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం మళ్ళీ ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముద్రగడ,  జోగయ్య ఇలా ఎవరో ఒకరు ఉద్యమాన్ని టేకప్ చేయటం గ్యారెంటీ. ఇపుడు గనుక రిజర్వేషన్ పొందకపోతే భవిష్యత్తులో సాధించలేమనే చర్చలు ఇప్పటికే కాపు సామాజికవర్గంలో మొదలైంది.



ఈ విషయమై అవసరమైన కసరత్తును కాపునాడు సంఘం పెద్దలు మొదలుపెట్టేశారు. ఈనెల 27వ తేదీ విశాఖలో జరగబోయే బహిరంగసభలో యాక్షన్ ప్లాన్ ప్రకటించే అవకాశాలున్నాయి. కాబట్టి విషయాన్ని నాన్చకుండా జగన్మోహన్ రెడ్డి వెంటనే కాపు రిజర్వేషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించేయటమే బెటర్. ఆలస్యమయ్యే కొద్దీ నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని జగన్ గ్రహించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: