స్విగ్గిలో అతిపెద్ద ఆర్డర్.. విలువ ఎన్ని లక్షలో తెలిస్తే షాకే?

praveen
ఇటీవల కాలంలో ఏది కావాలన్నా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరికేస్తుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లో ఇక రుచికరమైన ఆహారాన్ని వండుకొని తినడం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంత కష్టపడాల్సిన పనిలేదు. తినాలి అనే ఆలోచన కలిగింది అంటే చాలు నిమిషంలో జోబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి అందులో ఒక క్లిక్ ఇస్తే చాలు మనకు కావాల్సిన ఆహారం ఇంటి డోర్ ముందు వచ్చి వాలిపోతూ ఉంది.

 ఇక కావాల్సిన రెస్టారెంట్ నుంచి కూడా ఆహారం తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇలాంటి సర్వీసులను అటు జనాలకు అందించేందుకు ప్రస్తుతం ఎన్నో ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి. స్విగ్గి, జొమాటో లాంటి కంపెనీలు కేవలం ఆర్డర్ చేసిన నిమిషాలు వ్యవధిలోనే  ఫుడ్ డెలివరీ చేస్తూ ఇక మంచి సర్వీసులను అందిస్తూ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ లను ఉపయోగించుకుంటూ తమకు కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలను కూడా తెప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు రకరకాల ఫుడ్ ఆర్డర్లను స్విగ్గి లేదా జొమాటో ద్వారా  ఆర్డర్ చేయడం లాంటివి చాలా సార్లు చూసాం.. చేసాం కూడా.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం 2022 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇక ఈ ఏడాది ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయినా స్వీగ్గిలో అతిపెద్ద ఆర్డర్ ఏది అనేది హార్ట్ టాపిక్ గా మారిపోయింది. స్విగ్గి సంస్థ తమక యూజర్లకు 2022లో వచ్చిన అతిపెద్ద ఆర్డర్ విలువ 16.6 లక్షలు అన్న విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా స్విగ్గికి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ వచ్చాయట. ఎన్నో రకాల వంటకాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎక్కువ మంది మాత్రం బిర్యాని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం గ్రాసరీ  ఫ్లాట్ ఫామ్ నిర్వహిస్తుంది  స్విగ్గి. ఇకపోతే స్విగ్గి ఇన్స్టా మార్ట్ పై 2022లో బెంగళూరు కు చెందిన ఒక వ్యక్తి 16.6 లక్షల రూపాయల ఆర్డర్ చేశారట.  ఇలా ఆర్డర్ చేసిన మొత్తాన్ని కూడా 1.03 నిమిషానికి డెలివరీ చేసిందట స్విగ్గి సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: