"కోలార్ గోల్డ్ ఫీల్డ్స్" ను ఓపెన్ చేయనున్న మోదీ ప్రభుత్వం !

VAMSI
మన దక్షిణ భారతదేశంలో బంగారు గనులు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కన్నడ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా తర్వాత తెలియని చాలామందికి తెలిసిందని చెప్పాలి. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఉన్న గోల్డ్ ఫీల్డ్స్ లో ఒకప్పుడు బంగారాన్ని వెలికితీసేవారు. కానీ ఆ తర్వాత ఈ పనిని దాదాపు 20 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయం గురించి అంతా మరిచిపోయారు. అయితే కెజిఎఫ్ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం మదిలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి ఆలోచన మెదిలింది.
ప్రస్తుతం మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.. మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి కొత్త కొత్తగా అనేక ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తలుపులను ఓపెన్ చేసి మళ్ళీ తవ్వించడానికి ప్రణాళికలు చేస్తున్నారట. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో 50 మిలియన్ల వరకు శుభ్రపరిచి ఖనిజం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖనిజం నుండి బంగారాన్ని తీయడానికి కేంద్ర ప్రభుత్వం బిడ్స్ ను వేసేందుకు ప్రకటనను ఇవ్వడానికి చూస్తోందట. అంతే కాకుండా ఇలా బంగారాన్ని బయటకు తీస్తే దాదాపుగా  2.1 బిలియన్ డాలర్ల విలువ చేసే బంగారం లభిస్తుందట, ఇక్కడ బంగారం మాత్రమే కాకుండా పల్లాడియం అనే విలువైన మరో ఖనిజం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
త్వరితగతిన బంగారాన్ని శుద్ధి చేయడానికి బిడ్ లను వేయాల్సిందిగా అధికారికంగా మోదీ ప్రభుత్వం కోరనుందని సమాచారం. దీనికోసం ప్రత్యేక టీం అహర్నిశలు శ్రమిస్తోందట... కాగా భారత లో ఉన్న కంపెనీలకు బంగారాన్ని వెలికితీసే పనిలో అనుభవం మరియు టెక్నాలజీ తక్కువగా ఉన్నందున విదేశీ కంపెనీలతో టై అప్ అయ్యి.. ముందుకు వెళ్లే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కనుక స్టార్ట్ అయ్యి బంగారాన్ని వెలికితీస్తే మోదీ ఎవ్వరో చేయలేని పని చేసినట్లు అవుతుంది. దీని వలన ప్రభుత్వ ఖజానా కూడా నిండుతుంది. మరి ముందు ముందు ఏమేమి జరుగుతాయన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: