ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..కొత్త సంవత్సరంలో..

Satvika
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.ఇప్పటికే జీతాలను పెంచిన విషయం తెలిసిందే..మరో కొన్ని ఆఫర్లను అందిస్తున్నారు.ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను కేంద్రం చెప్పింది.ఎందుకంటే కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం గురించి ఓ శుభవార్త అందబోతోంది. సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ 4 శాతం పెరిగిన తర్వాత ప్రభుత్వం దానిని మరోసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. మార్చి 2023లో ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను 3-5 శాతం పెంచవచ్చు.

ఇది కాకుండా ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో ఈ పెంపు జరిగితే కేంద్ర ఉద్యోగుల డీఏ 41 నుంచి 43 శాతానికి చేరుకుంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగుల జీతం పెరగనుంది. దీంతో పాటు 18 నెలల డీఏ బకాయిలు కూడా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీపావళి, పండుగల సీజన్‌కు ముందు దేశంలోని 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో డీఏ, డీఆర్‌లను 4 శాతం పెంచింది.
జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం పెంచిన తర్వాత డీఏ లేద డీఆర్‌ వరుసగా బేసిక్ పే లేదా పెన్షన్‌లో 38 శాతంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో 2022లో మార్చిలో డీఏ సవరించబడింది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏ, డీఆర్‌లను సవరిస్తుంది. ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తుంది. ప్రభుత్వం డీఏను 3 నుంచి 5 శాతం వరకు సవరిస్తే, డీఏ 41 నుంచి 43 శాతం మధ్య ఉంటుంది. ఒకరి జీతం రూ.50,000, అతని మూల వేతనం రూ. 20,000 అయితే అతనికి 38 శాతం ప్రకారం 7,600 డీఏ వస్తుంది. డీఏ 5 శాతం పెరిగితే జీతం రూ.8,600 అవుతుంది. అంటే జీతంలో రూ.1,000 పెరుగుదల ఉంటుంది. ఏటా రూ.12,000 పెరగవచ్చు..
ఇకపోతే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2016 నుంచి 2.57 రెట్లు ఇస్తున్నా 3.68 రెట్లు పెంచాలని కేంద్ర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. గత సారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పుడు బేసిక్ జీతం రూ.6 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. ఈసారి కూడా పెంచితే బేసిక్‌ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు చేరనుంది..ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: