డిసెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

Satvika
ప్రతి నెల ఏదొక రూల్స్ మారుతూ వస్తున్నాయి..ఆ మార్పుల వల్ల ప్రజల పై మరో భారం పడనుంది.అలా డిసెంబర్ మాసంలో వచ్చే కీలక మార్పులు మన దైనందిన జీవితంపై ఎలాంటి మార్పులు చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది.ప్రతి నెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఇదే క్రమంలో వాటి రేట్లను పెంచటం లేదా తగ్గించటంపై కీలక ప్రకటన చేస్తాయి. దీనికోసం ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సారి డిసెంబర్ మాసంలో గ్యాస్ ధరలు తగ్గి చౌకగా మారతాయని చాలా మంది ఆశిస్తున్నారు. వీటికి తోడు LPG-CNG, PNG ధరలను సైతం కంపెనీలు మార్చే అవకాశం ఉంది.

 
చాలా నెలలుగా గృహ వినియోగ సిలిండర్ల రేట్లు తగ్గకపోటంతో చాలా మంది ఈ సారి ఆశగా ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. క్యాష్ విత్‌డ్రా చేసే విధానం కూడా మారవచ్చని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిసెంబర్ నెలలో ఏటీఎం ల నుంచి నగదు విత్ డ్రా ప్రక్రియలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం ఏటీఎంలో కార్డు పెట్టగానే కస్టమర్ మెుబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఏటీఎం స్కీన్ లో ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది..

దేశంలోని చాలా ప్రాంతాల్లో చలివల్ల ఏర్పడే పొగమంచు పెరుగుతుంటుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. పొగమంచు వల్ల భారతీయ రైల్వే తన టైమ్ టేబుల్‌ను కూడా మార్చి కొత్త టైమ్ టేబుల్ ప్రకారం రైళ్లను నడపనుంది తెలుస్తోంది. ప్రయాణికులు ముందుగా రైళ్ల రాకపోకల్లో వచ్చిన మార్పులను గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకోవటం ఉత్తమం..రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు దాదాపు 13 రోజులు మూసివేయబడి ఉంటాయి. పండుగలతో పాటు ఆదివారాలు, అనేక రాష్ట్రాల్లో పండుగల వల్ల ఈ సెలవులు మారతాయి. ఈ సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనుల కోసం సెలవుల వివరాలు ముందుగా తెలుసుకోవాలి.

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి గడువు నవంబర్ 30, 2022గా ఉంది. ఈ క్రమంలో నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్ ను సీనియర్ పెన్షనర్లు సమర్పించాల్సి ఉంది. అలా చేయని పక్షంలో డిసెంబర్ 1 నుంచి పెన్షన్ పొందటంలో అసౌకర్యం ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది..ఆ సర్టిఫికెట్ ఇవ్వకుంటే పెన్షన్ కూడా ఆగిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: