అమరావతి : లెక్కల్లో లోకేష్ మరీ ఇంత వీకా ?

Vijaya




నారా లోకేష్ రెండురకాలుగా లెక్క తప్పారు. మొదటిదేమో పాదయాత్ర విషయంలో అయితే రెండో లెక్క నియోజకవర్గం విషయంలో. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ అక్కడి నేతలతో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు జనవరి 27వ తేదీనుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధర్మయుద్ధం మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. తన పాదయాత్ర తనిష్టం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేదు.



అయితే ఈ సందర్భంగా చెప్పిన ఒక లెక్కే తప్పింది. అదేమిటంటే 175 నియోజకవర్గాల్లోను పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోను కనీసం 4 రోజులు ఉండబోతున్నట్లు చెప్పారు. యాత్ర మొత్తం 400 రోజులని చెప్పిన లోకేష్ ప్రతి నియోజకవర్గంలోను కనీసం 4 రోజులుంటానని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ నాలుగు రోజులుండాలంటే యాత్ర 700 రోజులు జరగాలి. ప్రతి నియోజకవర్గంలోను కనీసం నాలుగు రోజులన్నారంటే ఇకా ఎక్కువ జరిగే అవకాశం ఉందనే కదా అర్ధం.



లోకేష్ చెప్పిన ప్రకారం వేసుకుంటేనే పాదయాత్ర జరగాల్సింది 700 రోజులు. మరి 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నట్లు ఎలాగ చెప్పారు ? ఓ పదిరోజులు అటు ఇటు అయితే ఎవరు పట్టించుకోరు. కానీ లోకేష్ చెప్పిన లెక్క ప్రకారమే పాదయాత్రలో 300 రోజులు తేడా వస్తోంది. 300 రోజులంటే సుమారు 10 నెలలు. మరింత చిన్న విషయాన్ని లోకేష్ ఎలా మరచిపోయారో అర్ధంకావటంలేదు.



ఇక మంగళగిరిని తాను పార్టీకి కంచుకోటగా మార్చానని చెప్పారు. కంచుకోటంటే లోకేష్ పోటీచేయటమేనా లేకపోతే కనీసం ఐదారు ఎన్నికల్లో ఓడకుండా గెలుస్తుండటమా ? దీంతోనే లోకేష్ కు నియోజకవర్గం చరిత్ర తెలీదన్నది అర్ధమైపోయింది. ఎందుకంటే 1989 నుండి టీడీపీ అసలు ఇక్కడ పోటీనే చేయలేదు. 1985 ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ మళ్ళీ పోటీచేసింది 2014లో మాత్రమే. 2014,19 వరస ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి మంగళగిరిని కంచుకోటగా మార్చానని లోకేష్ చెప్పటం ఏమిటో అర్ధం కావటంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: