అమరావతి : అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

Vijaya







తన మనస్తత్వానికి భిన్నంగా చంద్రబాబునాయుడు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఎంపిక చేసేస్తున్నారు. మామూలుగా అయితే నామినేషన్ చివరి ఒకటిరెండు రోజులుండగా మాత్రమే అభ్యర్ధులను ప్రకటించటం చంద్రబాబుకు అలవాటు. సదరు నియోజకవర్గంలో పలానా నేత తప్ప పోటీచేయటానికి ఇంకెవరూ పోటీకూడా లేరని తెలిసినా సరే చంద్రబాబు మాత్రం టికెట్ ఫైనల్ చేయరు, బీఫారాన్ని అందించరు. ఇదొకరకంగా సాడిస్టిక్ నేచర్ అనే చెప్పాలి. ఈ విషయంలో చంద్రబాబును చాలామంది తిట్టుకుంటునే ఉంటారు.



అయితే రాబోయే ఎన్నికలకు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తు కొందరు అభ్యర్ధులను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేశారు. సిట్టింగ్ ఎంఎల్ఏలందరికీ టికెట్లను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మరో 20 మందిని కూడా ఫైనల్ చేసేశారు. అసలింతముందుగా అభ్యర్ధులను ఎందుకు ప్రకటిస్తున్నారు ? అనే విషయమే పార్టీలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే జనవరి 27వ తేదీనుండి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు. ఒకరకంగా ఈ పాదయాత్రే లోకేష్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేస్తుంది.



లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో భారీ ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ ఎవరు పెట్టుకుంటారు ? ఖర్చులను భరించాల్సిన అవసరం ఎవరికుంటుంది ? ఎవరికుంటుందంటే వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న నేతలకు మాత్రమే ఉంటుంది. ముందుగా కొంత ఖర్చులు పెట్టుకుంటే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారనే ఆశతోనే ఖర్చులకు నేతలు రెడీ అవుతారు.



నేతలతో ఖర్చులు పెట్టించాలంటే టికెట్లు ఫైనల్ చేయకపోతే ఎవరూ ముందుకురారు. అందుకనే తప్పని పరిస్ధితుల్లో మాత్రమే  చంద్రబాబు టికెట్లను ఫైనల్ చేస్తున్నారట. లోకేష్ పాదయాత్ర సాగే రూటులోని నియోజకవర్గాలకు అభ్యర్ధులకు ఫైనల్ చేయటంపై చంద్రబాబు దృష్టిపెట్టారట. కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. కాబట్టి ఈ రూటులో ఉండే నియోజకవర్గాలకే చంద్రబాబు ప్రయారిటి ఇస్తున్నారు. అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం వెనుక అసలు రహస్యం ఇదేనని పార్టీవర్గాలే చెప్పుకుంటున్నాయి. సరే కారణం ఏదైనా అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం మంచిదే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: