అమరావతి : అమరావతికి వైసీపీలో మద్దతా ? జగన్ కు షాక్

Vijaya





అమరావతికి మద్దతుగా వైసీపీ పెద్ద గొంతుకే లేచింది. మైలవరంకు చెందిన వసంత నాగేశ్వరరావు అమరావతికి మద్దతుగా బలంగా వాదనలు మొదలుపెట్టారు. అమరావతికి మద్దతుగా మాట్లాడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మూడురాజధానుల కాన్సెప్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మామూలుగా అయితే నాగేశ్వరరావు గొంతును ఎవరు పట్టించుకోవాల్సిన అవసరంలేదు. అయితే ఈ వసంత నాగేశ్వరరావు ఎవరంటే మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ తండ్రి.



కృష్ణప్రసాద్ తండ్రి కావటంతో నాగేశ్వరరావు వాదన ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న ప్రత్యర్ధులపైన మంత్రులు లేకపోతే వైసీపీ నేతలు విరుచుకుపడతున్నారు. అయితే ఇక్కడ స్వయంగా తమపార్టీ ఎంఎల్ఏ తండ్రే కావటం అందులోను ఈయన కూడా గతంలో ఎంఎల్ఏగా మంత్రిగా పనిచేసున్నారు. కాబట్టి ప్రత్యర్ధులపైన దాటిగా విరుచుకుపడినట్లుగా నాగేశ్వరరావుపై మాట్లాడలేకపోతున్నారు.



సరే మంత్రులు, నేతలు నాగేశ్వరరావుకు ధీటుగా సమాధానం చెప్పినా చెప్పకపోయినా అధికారపార్టీలో అమరావతికి మద్దతుగా పెద్ద గొంతు లేవటం మాత్రం కలకలం సృష్టించిందనే చెప్పాలి. అదికూడా కమ్మోరి గొంతు కావటం జగన్ కు బాగా ఇబ్బంది పెట్టేదే. ఎందుకంటే అధికారపార్టీలోనే జగన్ మూడురాజధానుల కాన్సెప్టుకు పూర్తి మద్దతు లేదన్న విషయాన్ని చంద్రబాబునాయుడో లేకపోతే ఇతర ప్రతిపక్షాల నేతలో ఎత్తిచూపితే ఎవరు సమాదానం చెప్పేందుకు లేదు. అసలు ఇక్కడ పాయింట్ ఏమిటంటే మూడురాజధానుల కాన్సెప్టును సక్సెస్ చేయటానికి జగన్ నానా అవస్తలు పడుతుంటే ఇదే సమయంలో ఒక ఎంఎల్ఏ తండ్రి అమరావతికి మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది.



చూస్తుంటే వసంత కృష్ణప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసే ఆలోచనలో లేరా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ వైసీపీ తరపునే పోటీచేసేట్లయితే జగన్ ఆలోచనలకు విరుద్ధంగా ఎలా మాట్లాడుతారు ? అనే చర్చ పెరిగిపోతోంది. ఏదేమైనా వసంత నాగేశ్వరరావు అమరావతికి మద్దతుగా  మీడియాలో మాట్లాడిన మాటలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి. మరి దీన్ని జగన్ ఎలా టాకిల్ చేస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: