కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Satvika
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం.మామూలు సాలరీ రూ.50 వేలు దాటిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా బెడ్ ను పొందవచ్చు..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా ఆరోగ్య స్కీమ్ ను అందిస్తున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు వివిధ చికిత్సలను పొందవచ్చు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ(DHFW), సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌(CGHS) కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో వార్డుల అర్హతకు సంబంధించిన నిబంధనలను సవరించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అధికారి అందుకుంటున్న బేసిక్ పే ప్రకారం ఇప్పుడు వార్డులకు అర్హత ఉంటుంది. అందుకు కావలసిన అర్హతలు..

డిపార్ట్‌మెంట్ తాజాగా తెలిపిన వివరాల మేరకు.. రూ.50,500 కంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులు CGHS కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల ప్రైవేట్ వార్డులకు అర్హులు. రూ.36,500 వరకు బేసిక్ పేగా పొందుతున్న ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జనరల్ వార్డులకు అర్హులు. అదే విధంగా రూ.36,501 నుంచి రూ.50,500 మధ్య బేసిక్ పే పొందుతున్న ఉద్యోగులకు సెమీ-ప్రైవేట్ వార్డులకు అర్హత ఉంటుంది. 2022 అక్టోబర్ 28 నాటి DHFW ఆఫీస్ మెమోరాండమ్‌లో.. సంబంధిత మంత్రిత్వశాఖ 2017 జనవరి 9 నాటి O.Mకు కొన్ని సవరణలు చేసింది. O.M పారా 3(B8)లో ఉన్న విధంగా CGHS కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలోని వార్డుల అర్హతను సవరించింది.

గత నెల నుంచి ఈ రూల్స్ అమల్లొకి వచ్చాయి.పే రూ.36,500 వరకు జనరల్‌ కిందకు వస్తుంది. రూ. 36,501 నుంచి రూ.50,500 వరకు సెమీ ప్రైవేట్‌గా నిర్ణయించారు. రూ.50,500 దాటితే ప్రైవేట్‌గా పేర్కొన్నారు.ప్రస్తుత HBAను ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అందిస్తున్నారు. HBA నిబంధనల ప్రకారం.. కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయడం, లేదా ఉద్యోగులు తమ సొంత స్థలంలో కొత్త ఇంటిని నిర్మించడం లేదా ఉద్యోగి ఉన్న ఇంటిని అభివృద్ది చేసుకోవడం వంటి వివిధ ప్రయోజనాలకు రుణాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7.1 % అతి తక్కువ రేటుతో రూ.25 లక్షలు రుణం కూడా పొందే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎ ను పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: