అమరావతి : టీడీపీ ఓటమిని ఒప్పేసుకున్నారా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవదని చంద్రబాబునాయుడుకు అర్ధమైపోయినట్లుంది. పార్టీ ఓడిపోతే భవిష్యత్తు ఎంత దుర్భరంగా ఉంటుందో తమ్ముళ్ళందరికీ కళ్ళకు కట్టినట్లు చెప్పారు. పార్టీ ఆఫీసులో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు. టీడీపీ గెలుపు తనకోసమో లేకపోతే పార్టీ నేతలకోసమో కాదట రాష్ట్రావసరం కోసమేనట.




సో భవిష్యత్ తరాలు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరాన్ని నేతలందరు గుర్తించాలన్నారు. తమ్ముళ్ళందరు మంచి భవిష్యత్తుకోసం కష్టపడి ఎన్నికల్లో పనిచేసి పార్టీని గెలిపించాలని పదేపదే చెప్పారు. తమ్ముళ్ళంతా సిద్ధంగా లేకపోతే రాష్ట్రంతో పాటు పార్టీకూడా అన్యాయమైపోతుందని చంద్రబాబు తెగబాధపడిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబు బాధంతా కేవలం తన కొడుకు లోకేష్ కోసమే అని అందరికీ తెలుసు.



అలాగే వచ్చేఎన్నికల్లో పార్టీ గెలవకపోతే తెలంగాణాలో పరిస్ధితే ఏపీలో కూడా తప్పదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. పార్టీకి బతుకులేకపోతే లోకేష్ కు భవిష్యత్తు ఉండదనే విషయంలోనే చంద్రబాబు భయపడుతున్నారు. రాజకీయంగా క్లైమ్యాక్సుకు చేరుకున్న తన భవిష్యత్తుకన్నా ఇపుడే స్టార్టయిన కొడుకు రాజకీయ భవిష్యత్తు మీదే చంద్రబాబు బెంగ పెరిగిపోతోంది. తనలోని భయాన్నే తమ్ముళ్ళల్లోకి చొప్పించి వాళ్ళని భయంతో పనిచేసేట్లు చేయాలనేది చంద్రబాబు ప్లాన్ లాగ కనబడుతోంది. అందుకనే తన భయమంతా తనకు అధికారం గురించి కాదని, పిల్లల భవిష్యత్తుగురించే అని పదేపదే చెబుతున్నది.



పార్టీ ఓడిపోతే..పార్టీ ఓడిపోతే అని పదేపదే చెబుతున్నారంటేనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబుకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే రాష్ట్ర భవిష్యత్తు కోసం తపనపడే నేతగా జనాలముందు కలరింగు ఇచ్చుకుంటున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలన ఎలాగుందో జనాలందరికీ అనుభవమైంది కాబట్టే ఘోరంగా ఓడగొట్టారు. తన మాటలను జనాలు నమ్మేసి 2024 ఎన్నికల్లో అధికారం అప్పగించేస్తారని అనుకుంటున్నట్లున్నారు. జనాలంత అమాయకులని చంద్రబాబు అనుకోవటమే విచిత్రంగా ఉంది. మరి చంద్రబాబుకు జ్ఞానోదయం ఎప్పుడవుతుందో ఏమో తెలీటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: