రాయలసీమ : చంద్రబాబుకు రాబోయేవే చివరి ఎన్నికలా ?

Vijaya



వచ్చేఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కాబట్టి జనాలంతా టీడీపీని గెలిపించాలని చంద్రబాబునాయుడు బతిమలాడుకుంటున్నారు. తన హయాంలో జరిగిన మంచిపనులను చూసి తనకు మళ్ళీ ఓట్లేసి గెలిపించమని అడగటంలేదు. చివరి ఎన్నికలు కాబట్టి, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన శపథం నెరవేరాలంటే జనాలంతా టీడీపీకి ఓట్లేయాలని అడగటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరటం కోసం జనాలు టీడీపీకి ఓట్లేయాలట.



చంద్రబాబు శపథం ఏమవుతుంది ? జనాలు నెరవేరుస్తారా లేదా అన్న విషయాలను పక్కనపెట్టేద్దాం. లాజికల్ గా చూస్తే మాత్రం రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరవి అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు వయసు సుమారు 73. అంటే ఎన్నికల సమయానికి 75కి  దగ్గరలో ఉంటుంది. ఆరోగ్యపరంగా ఫిట్టుగా ఉండే ఉండచ్చు కానీ వయసు రీత్యా మాత్రం క్లైమ్యాక్సుకు చేరుకున్నట్లే అనుకోవాలి.



ఇప్పటికే తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే సరిగా అర్ధం కావటంలేదు. ముందు ముందు ఇంకా సమస్య పెరిగిపోతుంది. ఒకవేళ వచ్చేఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా సమస్య అయితే రాబోయే కాలంలో తీవ్రం అయిపోవటం ఖాయం. గెలిస్తే ఒక  సమస్య గెలవకపోతే మరో సమస్యంతే. ఇక చంద్రబాబే చెప్పినట్లు టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఇపుడు తెలంగాణాలో పార్టీ పరిస్ధితి ఎలాగైతే అయిపోయిందో ఏపీలో కూడా సేమ్ టు సేమంతే.



లాజికల్ గా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా చంద్రబాబు మాటల్లోనే అర్ధమైపోతోంది వచ్చేఎన్నికలే చంద్రబాబుకు చివరివని. ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి ఇక దీనిపై ప్రత్యేకమైన డిబేట్లు కూడా అవసరంలేదు. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి టీడీపీని జనాలు అధికారంలోకి ఎందుకు తేవాలో ఒక్కటంటే ఒక్క కారణం కూడా చెప్పటంలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిది అరాచకపాలన అంటు గోలచేస్తున్నారు. జగన్ పాలనంతా అరాచకమని అనుకోవాల్సింది తాను కాదు జనాలన్న సింపుల్ లాజిక్కును చంద్రబాబు ఎందుకనో మిస్సవుతున్నారు. చూస్తుంటే చంద్రబాబుకే కాదు టీడీపీకి కూడా రాబోయేవి చివరి ఎన్నికలనే అనుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: