కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ బ్యాంక్..

Satvika
నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ సేవలలో పలు మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే..ఇప్పటికే ఎన్నో సేవలు అమల్లోకి వచ్చాయి.ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూనే వెళ్తున్నాయి. తాజాగా మరో బ్యాంక్ కూడా ఇదే దారిలో నడిచింది.ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. అలాగే సేవింగ్స్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పకోవచ్చు.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా ఎఫ్‌డీ రేట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచేసింది. నవంబర్ 15 నుంచి రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5 శాతంవరకు వడ్డీ వస్తుంది. అలాగే సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం దాకా వడ్డీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ ఏ టెన్యూర్లపై ఎంత వడ్డీ పెరిగిందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ ఉంది. 15 నుంచి 60 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ పొందొచ్చు. 61 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై కూడా ఇదే వడ్డీ రేటు ఉంది. 91 నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై 7.05 శాతం వడ్డీ వస్తుంది. 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 7.2 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు.ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 8.35 శాతం వడ్డీ పొందొచ్చు. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 7.35 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై అయితే 7.45 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.35 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 6.1 శాతం వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు అయితే క్యాలబుల్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది..

అలాగే సేవింగ్ ఖాతాలపై అయితే వడ్డీ రేటు 4.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. రూ.లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకుఇది వర్తిస్తుంది. అదే రూ.లక్ష నుంచి రూ.50 లక్షల దాకా బ్యాలెన్స్ ఉంటే 7 శాతం వడ్డీ పొందొచ్చు. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు అధిక వడ్డీ రేటు వస్తుంది. కాగా ఇప్పటికే పీఎన్‌బీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు అన్నీ బ్యాంక్ లు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: