కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్..

Satvika
ఈ నెల మొదటి వారం నుంచి బ్యాంకులు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్నారు..ఇప్పటికే ఎన్నో బెనిఫిట్స్ ను అందుకున్నారు.ఈ మేరకు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న బజాజ్ ఫైనాన్స్  తన కస్టమర్లకు తీపికబురు అందించింది.క్రిసిల్ ఏఏఏ స్టేబుల్, ఇక్రా ఏఏఏ స్టేబుల్ రేటింగ్ పొందిన బజాజ్ ఫైనాన్స్ కీలక నిర్ణయ తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. ఇప్పటికే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. దీంతో బజాజ్ ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకునే వారికి గతంలో కన్నా అధిక వడ్డీ రేటు లభిస్తుంది.



ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 8 నుంచి అమలులోకి వచ్చిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. రూ. 15 వేల నుంచి డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో ఇప్పుడు డిపాజిట్ దారులకు గరిష్టంగా 7.85 శాతం వరకు వడ్డీ వస్తుంది.60 ఏళ్లకు లోపు వయసు కలిగిన వారు 44 నెలల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే.. వారికి 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 0.25 శాతం అధిక వడ్డీ వస్తుంది. అలాగే అధిక వడ్డీ రేటు కోరుకునే కంపెనీ బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న స్పెషల్ టెన్యూర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది..



బజాజ్ ఫైనాన్స్ 15 నెలలు, 18 నెలలు, 22 నెలలు, 30 నెలలు, 33 నెలలు, 44 నెలలు కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. అంతేకాకుండా బజాజ్ ఫైనాన్స్ సిస్టమ్యాటిక్ డిపాజిట్ ప్లాన్ కూడా అందబాటులో ఉంచింది. నెలకు రూ. 5 వేల నుంచి డబ్బులు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది.బజాజ్ ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరవొచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. అంటే సులభంగానే బజాజ్ ఫైనాన్స్‌లో డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. కాగా మరోవైపు సుందరం ఫైనాన్స్ కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచేసింది. బ్యాంకులు వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంపు ఇందుకు ప్రధాన కారణం..పొదుపు చేసేవారికి అదిరిపొయె గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: