ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్..బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

Satvika
ప్రజలపై వరుణుడు కన్నెర్ర చేశారు..గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చాలామంది రోడ్డున పడ్డారు.అయిన కూడా వర్షాలు తగ్గెలా లేవు.. మొన్నటివరకు తెలంగాణను వణికించింది.. ఇప్పుడు ఏపీని.. ఏపీని వానలు వీడే ఛాన్సులు కనిపించడం లేదు. ఇప్పటికే దండిగా వర్షపాతం నమోదయ్యింది. ఇప్పుడు మరో అల్పపీడనం అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో నవంబర్ 9న ఈ అల్పపీడనం ఛాన్స్ ఉందని తెలిపింది..

తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ స్వల్పంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఇది పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12న తీరం దాటే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు చెన్నై పైనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రా పై స్పల్పంగా ఎఫెక్ట్ చూపనుంది. ఇక ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణము లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి..


నిన్న దక్షిణ కోస్తాంధ్రలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. రాయలసీమ లోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. నేడు ఇక్కడ సైతం వాతావరణం పొడిగా మారనుంది. అల్ప పీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్న తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాల కు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయి లో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేశారు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: