వచ్చే నెలలో 10 రోజులు బ్యాంకులకు సెలవులు..ఏయే రోజులంటే?

Satvika
ప్రతి నెల కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఉంటాయి.అయితే ఈ సెలవులను గమనిస్తే బ్యాంకు పనుల ను ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. అనే విషయాలను ముందస్తుగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సెలవులను తెలుసుకుంటే బ్యాంకులు తెరిచి ఉన్న రోజుల్లో బ్యాంకు పనులు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. లేకపోతే బ్యాంకుల కు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ హాలీడేస్ అనేవి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటాయి.. వాటి ప్రకారం, ఆర్బీఐ సెలవులను నిర్ణయిస్తుంది.. ఇప్పుడు కూడా అలాగే నవంబర్ నెలలో సెలవుల లిస్ట్ ను ప్రకటించారు.. ఆ రోజుల్లో బ్యాంకులు అసలు పనిచేయవు.
ఈ నేపథ్యం లో నవంబర్‌ నెలలో బ్యాంకులు 10 రోజుల పాటు మూత పడనున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం కొన్ని రాష్ట్రాల్లో మూసి ఉండవచ్చు.. మరి కొన్ని రాష్ట్రా ల్లో తెరిచి ఉండవచ్చు. రాష్ట్రాల ను బట్టి ఆర్బీఐ సెలవుల ను నిర్ణయిస్తుంది..

నవంబర్ నెల ఏయే రోజుల్లో బ్యాంకు లకు సెలవులో ఇప్పుడు చుద్దాము..

నవంబర్‌ 1న - కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
నవంబర్ 6 - ఆదివారం
నవంబర్ 8 - గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌ టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం లో సెలవు
నవంబర్ 11 - కనకదాస జయంతి-వంగల పండుగ.. బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్‌ 12 - రెండో శనివారం
నవంబర్‌ 13 ఆదివారం
నవంబర్‌ 20 - ఆదివారం
నవంబర్‌ 23 - సేంగ్‌ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)
నవంబర్‌ 26- నాలుగో శనివారం
నవంబర్‌ 27 - ఆదివారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: