హైదరాబాద్ : జాతీయ మీడియా షాకిచ్చిందా ?

Vijayaఎవరెన్ని చెప్పినా ఎంఎల్ఏల  ట్రాప్ ఘటనలో టీఆర్ఎస్ బోల్తాపడిందన్నది వాస్తవం. ఏమనుకుని ఎంఎల్ఏల ట్రాప్ ఘటనను నిడిపించిందో కానీ అది బయటపడేసరికి అంతా ఉల్టాపల్టా అయిపోయింది. నలుగురు టీఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనుగోలుకు బీజేపీ బరితెగించిందంటు టీఆర్ఎస్ ఎంఎల్ఏ బాల్కసుమన్ ఎంత అరిచి గీపెట్టినా అక్కడ ఆధారాలు ఏమీ దొరకలేదు. పైగా టీఆర్ఎస్ ఎక్కడ వీకైపోయిందంటే ఇలాంటి బేరాలాడటంలో కేసీయారే సిద్ధహస్తుడు కాబట్టి.టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఎలా కొనుగోలుచేసింది, ఎలా ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లోకి లాక్కున్నది అందరు చూస్తున్నదే. ఒకవైపు ఇతర పార్టీల నుండి తాను ఎంఎల్ఏలను లాక్కుని తన దగ్గరనుండి బీజేపీ ఎంఎల్ఏలను లాక్కుంటోందని గొంతుచించుకుంటే ఎవరు పట్టించుకుంటారు ? పైగా టీఆర్ఎస్ ఎంఎల్ఏలను బీజేపీ లాక్కుంటుందోనే ఆరోపణలకు ఆధారాలు కూడా లేవు. ఎంఎల్ఏలున్న ఫాం హౌస్ మీద పోలీసులు దాడి చేసినపుడు అక్కడ ఎంఎల్ఏలు తప్ప డబ్బులేమీ దొరకలేదు. ఇపుడేదో ఆడియో అంటు ఒకటి టీవీల్లో వినబడుతున్నా ఆది సాక్ష్యానికి పనికిరాదు.ఇదే విషయంపైనే పోలీసులు పెట్టిన కేసును ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీంతో కేసీయార్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడ అన్నింటికన్నా పెద్ద సమస్య ఏమిటంటే ఈ మొత్తం ఎపిసోడ్ ను జాతీయమీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం రాత్రి ఘటన బయటపడి గురువారమంతా నానా హడావుడి జరిగినా తెలంగాణా మీడియా మాత్రమే హైలైట్ చేసింది. బుధ, గురువారాల్లో టీఆర్ఎస్ ప్రముఖులు ఎంత ప్రయత్నించినా జాతీయమీడియా సీరియస్ గా తీసుకోలేదు. మొత్తం ఎపిసోడ్లో ఆధారాలు, మసాలా లేకపోవటంతో ఎవరు పట్టించుకోలేదు.
అప్పటికీ ఎంఎల్ఏల ట్రాపింగ్ పై టీఆర్ఎస్ హిందీ, ఇంగ్లీషులో ప్రెస్ నోట్లు రెడీచేసి ఢిల్లీలోని జాతీయమీడియాకు పంపింది. అయినా ఒక్కళ్ళంటే కనీసం ఒక్కళ్ళు కూడా సీరియస్ గా తీసుకోకపోవటమే వీళ్ళకు షాక్ కొట్టింది. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ప్రత్యేకంగా అందరితో మాట్లాడారట కూడా. అయినా ఫలితం కనబడలేదు. జాతీయమీడియా ఒకటే ఊదరగొట్టేస్తుంది దెబ్బకు బీజేపీ గబ్బుపట్టి పోవటం ఖాయమని కేసీయార్ చాలా ఆశించారు.  బీజేపీపై యుద్ధం మొదలుపెట్టేయాలని అనుకున్నారు. అయితే ఆశించినదానికి విరుద్ధంగా జరిగింది. దాంతో ఏమిచేయాలో ఇపుడు దిక్కుతోచటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: