టాక్స్ నుంచి బయటపడాలంటే ఇలా తప్పక చెయ్యాలిసిందే..!!

Satvika
మనం ఉద్యోగం చేసినా..లేక ఏదైనా వ్యాపారం చేసిన కూడా ఎంతో కొంత ఎమౌంట్ అనేది ప్రభుత్వానికి చెల్లించాలి..జీతం పెరిగినా వ్యాపారం పెరిగినా పన్ను కూడా పెరుగుతుంది.కష్టం మనది టాక్స్ వాళ్ళది.అందుకే ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అయితే పన్ను మినహాయించాలంటే ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అయితే ఇందులోకి అన్ని ప్రభుత్వ పథకాలు రావు. కొన్నిటికి మాత్రమే ప్రభుత్వం మినహాయింపునిచ్చింది..ఆ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు


బ్యాంకులకి సంబంధించి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో డిపాజిట్‌ చేయడం వల్ల పన్ను ఆదా లభిస్తుంది. సెక్షన్ 80C కింద పెట్టుబడిదారులు రూ.1.5 లక్షల రాయితీని పొందుతారు. పన్ను ఆదా చేసే FDలో పెట్టుబడి పెట్టే ముందు పథకం లాక్-ఇన్ పీరియడ్‌ 5 సంవత్సరాలు ఉండాలని గుర్తుంచుకోండి.


జాతీయ పెన్షన్ పథకం..


నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80CCE కింద మినహాయింపు పొందుతారు. అంతేకాదు రిటైర్మెంట్ ఫండ్ ప్రయోజనం కూడా పొందుతారు. దీని కారణంగా మీ అనేక సమస్యలు తీరుతాయి..


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఆదాయపు పన్నును ఆదా చేయడానికి మంచి పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మంచి రాబడిని పొందుతారు. ఈ పథకం కింద 7.1% వడ్డీ లభిస్తుంది. మీరు ఈ స్కీమ్‌లో ఏటా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది.


 ఈపీఎఫ్‌ అకౌంట్‌


మీరు ఉద్యోగుల భవిష్య నిధి కింద పెట్టుబడి పెడితే 8.1% వరకు వడ్డీ రేటు పొందుతారు. ఈ పథకంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతో మీరు సులభంగా పన్ను ఆదా చేసుకోవచ్చు..


ELSS మ్యూచువల్ ఫండ్


ELSS మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు గొప్ప రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. 1.5 లక్షల పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం లాక్-ఇన్ వ్యవధి 3 సంవత్సరాలు మాత్రమే..
ఈ పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మనకు టాక్స్ అనేది తగ్గింపు ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: