అతనో దినసరి కూలీ.. కానీ కూతురు కోసం రోబో తయారు చేశాడు?

praveen
వారి కుటుంబం మొత్తం వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ సంతోషంగా జీవిస్తుంది.  ఇలాంటి సమయంలో విధి వారికి ఒక పరీక్ష పెట్టింది. వారికి ఒక కూతురు పుట్టింది. అయితే పుట్టుకతోనే అంగవైకల్శంతో ఉండడం గమనార్హం. దీంతో కూతురు వయసు పెరుగుతున్న ఇంకా నెలలు నిండని చంటిపాపల కూతురుని చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే భర్త ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటే భార్య ఇక కూతురిని చూసుకుంటూ ఉండేది. అయితే అతను దినసరి కూలీగా పని చేస్తూ ఉండేవాడు. అయితే కూతురికి సేవలు చేస్తున్న భార్య కూడా చివరికి అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో కూతురి ఆలనా పాలన చూసుకోవడం మరోవైపు పనికి వెళ్లి డబ్బులు సంపాదించడం ఎంతో కష్టంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒక సాదాసీదా దినసరి కూలి చేసిన ఆలోచన అందరిని అవాక్కయ్యేలా చేసింది.

 ఏకంగా కూతురికి భోజనం పెట్టేందుకు ఓ రోబో లాంటి పరికరాన్ని తయారు చేశాడు. ఇదే తన కుమార్తెకు ప్రతిరోజు భోజనం పెడుతూ సహకరిస్తుంది అంటూ చెబుతున్నాడు. ఈ ఘటన దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోర గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బిపిన్ కదం అనే 40 ఏళ్ల వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అతనికి సాంకేతికతపై ఎలాంటి అవగాహన లేదు. కానీ కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతోందని భావించి రోబో లాంటి ఒక పరికరం కోసం అన్వేషించాడు. అది ఎక్కడ లభించకపోవడంతో అతనే దానిని తయారు చేసేందుకు పూనుకున్నాడు .

నిత్యం 12 గంటల పాటు పనులు పూర్తి చేసుకుని తర్వాత మిగిలిన సమయంలో సాఫ్ట్వేర్ పై అవగాహన పెంచుకొని నాలుగు నెలల శ్రమించి ఒక చిన్ని రోబోను తయారు చేశాడు. రోబో వాయిస్ కమాండ్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. చేతిలో పల్లెం పెడితే అందులో ఉన్న ఆహారాన్ని అమ్మాయికి తినిపిస్తుంది. ఏ కూరతో తినిపించాలో చెబితే ఆ కూరతో కలిపి తినిపిస్తుంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతూ అతని ప్రతిభకు సలాం కొడుతున్నారు. ఇక ఈ రోబోను చూసి గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అతని ప్రశంసించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: