లాటరీలో 25 కోట్లు.. రాకున్నా బాగుండేది అంటున్న వ్యక్తి?

praveen
ఇటీవల కాలం లో డబ్బులు సంపాదించడం అంత సులభంగా ఏమీ జరగడం లేదు. ఎంత మంచి జాబ్ వచ్చినా కూడా ఖర్చులన్నీ ఫోను చేతిలో మిగిలేది మాత్రం తక్కువ మొత్తం లోనే అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. దీంతో పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వారు సైతం లక్షల రూపాయలు జీతం వస్తున్న ఇంకా తమా ఖర్చులకు సరి పోవడం లేదు అంటూ అదనపూ ఆదాయం కోసం ఎదురుచూస్తున్న ఘటనలు వెలు గులోకి వస్తున్నాయి. అలాంటిది ఇక కోట్ల రూపాయలు సంపాదించడం అంటే అది కామన్ మ్యాన్ కు కేవలం కలలో మాటే అని చెప్పాలి.

 కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమందికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి తలుపు తట్టి చివరికి అనుకోని విధంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు గా మారిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంతో మంది లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం చివరికి లాటరీ టికెట్ల ద్వారా ఏకంగా కోట్ల రూపాయలు గెలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఎవరి విషయంలోనైనా జరిగితే వారి కంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అని అందరూ భావిస్తూ ఉంటారు.

 కానీ ఇటీవల లాటరీలో 25 కోట్లు గెలుచుకున్న ఒక ఆటో డ్రైవర్ మాత్రం తనకు లాటరీ రాకపోయినా బాగుండేది అంటూ బాధపడుతూ ఉన్నాడు.  కేరళలోని ఓనం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్ ఇటీవల లాటరీ ద్వారా 25 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పుడు అదే లాటరీ వచ్చినందుకు బాధపడుతున్నాడట. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా సహాయం చేయాలని అడుగుతున్నారని.. కాదంటే శత్రువులా చూస్తున్నారని.. దీనివల్ల మనశ్శాంతి కూడా కరువైంది అంటూ అనుప్ చెబుతూ ఉన్నాడు. దీనికి బదులు లాటరీ రాకుండా ఉన్న బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: