మహిళలే మళ్ళీ జగన్ ను గెలిపిస్తారా ?
అందులో భాగంగానే జనవరి నుండి ఫించన్ ను పెంచుతున్నారు. పింఛన్ పెరుగుదలతో అధికాశా 2750 కానుంది. వాస్తవంగా మానిఫెస్టోలో చెప్పిన విధంగానే జగన్ చేస్తున్నారు. జగన్ మాట్లాడుతూ ఇది కేవలం మహిళల కోసమే కొనసాగుతున్న ప్రభుత్వం అంటూ చాటి చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క సంక్షేమ పధకం కూడా గత ప్రభుత్వాల లాగా మధ్యవర్తుల పాలు కాకుండా... డైరెక్ట్ గా లబ్దిదారులకు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని గర్వంగా చెప్పారు. ఆ విధంగా ఈ సభలో మహిళల కోసం చేసిన అన్ని పధకాలను వివరించి మరోసారి తనకే ఓటు వేయాలని పరోక్షముగా మహిళల మనసులో నాటుకుపోయేలా చెప్పడంలో జగన్ సఫలీకృతుడయ్యాడని చెప్పాలి.
ఇక ఇప్పటికీ ఏపీలో జరిగిన ఎన్నికల సర్వే ప్రకారం మళ్ళీ గెలిచేది జగన్ అంటూ తెలుస్తోంది. కాగా మరికొన్ని సర్వేలు ఓడిపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ గెలుపు దక్కాలంటే మహిళల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. మరి జగన్ పాలనలో అక్కచెల్లెమ్మలు సంతోషపడ్డారా ? సంతృప్తిగా ఉన్నారా ? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.