విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.15 వేలు స్కాలర్షిప్ పొందే అవకాశం..

Satvika
మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ.. కరోనా తర్వాత అందరికి భద్రత పై ఆసక్తి కలిగింది. దీంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్ పాలసిని తీసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం పాలసీ దారులకు కూడా ఎల్ఐసీ కొత్త పథకాల ను అమలు చేస్తూ వస్తుంది. మంచి బెనిఫిట్స్ ను కూడా పొందడాని కి కొత్త ఆఫర్స్ ను అందిస్తుంది. ఇది ఇలా ఉండగా.. ఎల్‌ఐసీ ఉద్యోగుల కోసం బంప రాఫర్‌ తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ స్కాలర్షిప్‌ అందిస్తోంది.

ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తు లు స్వీకరిస్తోంది. ఇంతకీ ఈ స్కాలర్షిప్‌ పొందడానికి ఉండాల్సిన అర్హతలు మొదలగు విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం… ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అందిస్తోన్న ఈ స్కాలర్షిప్‌ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీ లో 2022-23 విద్యా సంవత్సరాని కి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి.

అలాగే విద్యార్థులు 12 వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల పేరెంట్స్‌ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్‌ కు ఎంపికైన విద్యార్థుల కు ఏడాది కి రూ. 15,000 చొప్పున మూడు దఫాలుగా అందిస్తారు.. స్కాలర్షిప్‌ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కచ్చితంగా ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ 30-09-2022 తో ముగియనుంది. అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: