ఖైదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఆ ఫెసిలిటీ జైల్లోనే..

Satvika
చేసిన నేరానికి శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు కొన్ని ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈ ఫెసిలిటీ ఏ దేశం లో లేని విధంగా  ఉన్నాయి.అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం….



పంజాబ్ ప్రభుత్వం జైళ్లలో ఎక్కువ కాలంగా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఇప్పటి నుంచి మూడు నెలల కు ఒకసారి, వారి భార్యల తో కలుసుకునే వెసులు బాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. జైలులో ఎక్కువ కాలంగా శిక్షలో ఉన్నవారికి ప్రయారిటీ ఇస్తారు. అదే విధంగా జైలులో అధికారుల తో, తోటీ ఖైదీల తో సత్ర్పవర్తక కల్గి ఉన్న వారికి తమ భార్యలను కలిసే అవకాశం కల్పిస్తారు.



భార్యలకు దూరంగా ఉంటున్న భర్తలు మానసికంగా కుంగిపోతుంటారని వివిధ అధ్యయనాల్లో తెలింది. దీన్ని పరిగణలోని కి తీసుకున్న అధికారులు ఇప్పటికే ములాఖత్ తో వారి బంధువులను కలిసే అవకాశం కల్పిస్తున్నారు.. ఖైదీల కు మూడు మాసాలకు ఒకసారి వారి భార్యల తో ఏకంతంగా జైలులోనే గడపచ్చు. దీని కోసం ప్రత్యేకంగా జైలులోనే గదులు ఉంటాయి. దానిలో ప్రత్యేకంగా వసతులు కూడా ఉంటాయి..



 2 గంటల పాటు తమ భార్యల తో ఏకాంతంగా మాట్లాడుకొవచ్చు. తమ కష్ట, సుఖాలను వారితో పంచుకోవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ లోని ఖైదీలు ఇప్పుడు తమ జీవిత భాగస్వాముల తో కొంత సమయం గడపవచ్చు, జైళ్ల శాఖ మంగళవారం నుండి ఖైదీల కోసం వివాహ సందర్శనను ప్రారంభించింది, అటువంటి సౌకర్యాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా పేర్కొంది.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కరుడు కట్టిన నేరస్తులకు..కఠిన నేరాలు చేసిన వారికి ఇది వర్తించదు. ఆడపిల్లలపై అత్యాచారం, హత్యలు, దోపిడీలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ ఫెసిలిటీ వర్తించదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: