పొద్దుటూరు లో టిడిపి ఓటమి ఖాయం ?

VAMSI
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మంచి హాట్ హాట్ హా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని కసితో ముందుకు వెళుతుంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి విజయం దక్కకుండా చేయడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక బీజేపీ జనసేన లాంటి పార్టీలు టీడీపీ కి మద్దతు ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాయి. అయితే ఎనికల సమయానికి ఈ పొత్తుల మీద  ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ..
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ గత ఎన్నికల్లో ఒకింత కుదుపుకి  గురైంది. ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈసారి ఏ విధంగా ఉండనుంది అన్నది అందరిలోనూ ఉత్కంఠను కలిగిస్తోంది. కాగా కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం లో టిడిపి కి షాక్ తగిలే లాగా ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంఛార్జి ల మధ్యన టిక్కెట్ గొడవలు ఇప్పటి నుండే మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే... నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యన చంద్రబాబు ను కలిసి నియోజకవర్గ విషయాలను వివరించారు. పైగా తాను టీడీపీ లోకి జూన్ చేయించిన సభ్యుల వివరాలను కూడా వివరించడం జరిగింది. దీనితో చంద్రబాబు హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వనున్నాడని ప్రవీణ్ వర్గ నేతలు పొద్దుటూరు లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు అట.
ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మరియు అనుచరులు ఇదంతా వస్తావా కాదు. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు పాళ్ళు టికెట్ నాకే అంటూ సవాలు విసురుతున్నారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు టిక్కెట్ కోసం ఇలా వాదులాడుకోవడం హాస్యాస్పదం అని చెప్పాలి. అయితే ఇదంతా చూస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులు మరియు సీఎం సురేష్ బాబు లు ఉన్నారు. అయితే వీరి నలుగురిలో ఎవరికీ టికెట్ ఇచ్చినా మిగిలిన ముగ్గురు వెన్నుపోటు కు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ టీడీపీ గెలవడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: