ఓటర్ ఐడికి ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోలేదా?ఇలా చేస్తే సరి..

Satvika
కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి..దాంతో ప్రతి సేవకు ఆధార్ కార్డును అనుసందానం చెయ్యాలి.ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం చేస్తున్నాయి ఆయా శాఖలు.భారత ఎన్నికల సంఘం కూడా ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు పలు సంస్కరణలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేయాలని సూచించింది.



ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ నెంబర్ తో లింక్ చేయడం మూలంగా ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే తెలుస్తుంది. వెంటనే అధికారులు మిగతా ఓట్లను తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటర్ ఐడీ ఉన్న పౌరులు స్వచ్ఛందంగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని సూచింది. ఓటర్ ఐడీ, ఆధార్ లింక్ తప్పని సరి కాదని వెల్లడించింది..2021కి ఆమోదం లభించింది. అప్పటి నుంచి ఆధార్ నెంబర్ తో ఓటర్ గుర్తింపు కార్డులను లింక్ చేసే ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటి వరకు చాలా మంది తమ ఓటర్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకున్నారు. ఒక వేళ మీరు కూడా ఆధార్ నెంబర్ తో ఓటర్ ఐడీ కార్డును లింక్ చేసుకోకపోతే.. సులభమైన పద్దతులతో మీ స్మార్ట్ ఫోన్ లేదంటే కంప్యూటర్ నుంచి  లింక్ చేసుకోవచ్చు...


ఎలా లింక్ చేసుకోవాలి..


ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Voter Helpline యాప్ ఇన్‌ స్టాల్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసిన తర్వాత Voter Registration ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది.
Yes I have voter ID ఆప్షన్ సెలక్ట్ చేసి క్లిక్ చేయాలి.
మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.
Fetch Details పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Done పైన క్లిక్ చేయాలి.
మీ ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
అంతే సులువుగా ఇంట్లో కూర్చుని అప్డేట్ చేసుకొవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: