కోస్తా : ఒంగోలు ఎంపీగా దగ్గుబాటి పోటీచేయబోతున్నారా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ తరపున దగ్గుబాటి పురందేశ్వరి పోటీచేయబోతున్నారా ? పార్టీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఎందుకంటే చీరాల నుండి పురందేశ్వరి కొడుకు దగ్గుబాటి చెంచురామ్ పోటీచేస్తారనే టాక్ పార్టీలో బాగా వినిపిస్తోంది. ముందైతే పరుచూరి నుండి పోటీచేయబోతున్నారనే అనుకున్నారు.




అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. సో పరుచూరు నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ ఏలూరిసాంబశివరావు పోటీచేయటం ఖాయమైపోయింది. దాంతో వేరేదారిలేక దగ్గుబాటి చెంచురామ్ చీరాల నుండి పోటీచేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. కొడుకు చెంచురామ్ టీడీపీ తరపున పోటీచేస్తే తల్లి బీజేపీ నుండి పోటీచేయటం సాధ్యంకాదు. టెక్నికట్ గా ఎలాంటి సమస్యా లేకపోయినా రాజకీయంగా అనేక ఇబ్బందులుంటాయి.



పోయిన ఎన్నికల్లో పరుచూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన  విషయం తెలిసిందే. తర్వాత భార్యభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం మంచిదికాదనే వెంకటేశ్వరరావు వైసీపీ నుండి బయటకు వచ్చేశారు. రాజకీయంగా వెంకటేశ్వరరావు రిటైర్ అయిపోయినట్లే. అందుకనే కొడుకును తెరమీదకు తీసుకొస్తున్నారు. సో చెంచురామ్ టీడీపీ తరపున చీరాల నుండి పోటీచేయటం దాదాపు ఖాయమైపోయినట్లే. అందుకనే పురందేశ్వరి కూడా బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.




పార్లమెంటు పరిధిలో పరుచూరు అసెంబ్లీ లేకపోయినా  ఒకేపార్టీ అయితే చాలా ఉపయోగాలుంటాయనేది వీళ్ళ ప్లాన్. ఇదే సమయంలో పురందేశ్వరికి బీజేపీలో ఆదరణ తగ్గిపోతోంది. ప్రధాన కార్యదర్శిగా చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ ఇన్చార్జిలుగా తొలగించారు. ఆమె ఇపుడు చేరికల కమిటికి మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు. ఈ పోస్టులో ఆమె చేస్తున్నది కూడా ఏమీలేదు. సో ఆమెకూడా ఎన్నికల సమయానికి టీడీపీలోకి వచ్చేసే అవకాశాలున్నాయన్నది టాక్. చాలాకాలం మొహాలు కూడా చూసుకోవటానికి ఇష్టపడి వెంకటేశ్వరరావు-చంద్రబాబునాయుడు ఇపుడు ఫంక్షన్లలో కలుసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చెంచురామ్ ఇటు చంద్రబాబు అటు లోకేష్ తో రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. కాబట్టి తొందరలోనే దగ్గుబాటి ఫ్యామిలీ అంతా టీడీపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: