హైదరాబాద్ : కేసీయార్నే టెన్షన్ పెట్టేస్తున్నారా ?

Vijaya






తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో ఇంతవరకు కేసీయార్ అభ్యర్ధిని ప్రకటించలేకపోయారు. ఎవరిని ప్రకటిస్తే ఏమవుతుందో అన్న భయంతోనే కేసీయార్ ఎప్పటికప్పుడు అభ్యర్ధి ప్రకటనను వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఇలా ఎంతకాలం వాయిదాలు వేసుకుంటూ పోతారన్నదే పాయింట్. అసలు అభ్యర్ధిని ప్రకటించటంలో కేసీయార్ సమస్య ఏమిటి ? ఏమిటంటే నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లు బీసీలు.



అయితే కేసీయార్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీలోకి దించాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత ప్రకటించేందుకు ఎందుకు వెనకాడుతున్నారు ? ఎందుకంటే కూసుకుంట్లను నియోజకవర్గంలోని నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టే. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న నేతలందరినీ కాదని అభ్యర్ధిగా ప్రకటిస్తే రేపు ఓడిపోతే పోయేది కేసీయార్ పరువే. ఇంతకీ విషయం ఏమిటంటే మునుగోడులో పార్టీ తరపున బీసీ అభ్యర్ధిని మాత్రమే పోటీచేయించాలని బీసీనేతలు కేసీయార్ కే అల్టిమేటమ్ ఇచ్చారు.



దీనికి కారణం ఏమిటంటే నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు బీసీలే. సుమారు 2.20 లక్షల ఓట్లలో దాదాపు 1.5 లక్షల ఓటర్లు బీసీలే. వీరిలో కూడా గౌడ సామాజికవర్గానికి చెందిన వారు 35,150 మంది, యాదవులు 21,360, పద్మశాలీలు 11,680, ముదిరాజ్ లు 34 వేలున్నారు. బీసీల ఓట్లు ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి పోటీచేసే అవకాశం తమకే ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.




ఇక్కడ విషయం ఏమిటంటే టీఆర్ఎస్ తరపున మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం చేస్తున్నా ఎక్కడా బీసీ నేతలు మాత్రం కనబడటంలేదు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంఎల్సీ కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి టికెట్ ఆశిస్తున్నారు. వివిధ కారణాలతో వీళ్ళలో ఎవరూ పార్టీ ప్రచారంలో కనబడటంలేదు. పార్టీ గెలుపుకోసం పార్టీలోని బీసీ నేతలే ప్రచారంలో కనబడకపోతే పార్టీ పరువు పోదా అనే చర్చ పెరిగిపోతోంది. దాంతో తాను డిసైడ్ చేసిన కూసుకుంట్లకు టికెట్ ఇవ్వలేక అలాగని బీసీల ఒత్తిడికి లొంగిపోయి బీసీ నేతలు ప్రకటించలేక కేసీయార్ నానా అవస్తలు పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: