చిరుతల రాకతో వణికిపోతున్న గ్రామస్థులు?

Purushottham Vinay
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్బంగా చీతా ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆ నేషనల్‌ పార్క్‌ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు.ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్‌ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నారు.


అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్‌ గుర్జార్‌ అనే మరో రైతు చెబుతున్నాడు.మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు.ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్‌ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి అనేది దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదన చెబుతున్నారు. అందువల్ల ఈ ఇష్యూస్ పై జనాలు చాలా తీవ్రంగా మండి పడుతూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా నెటిజన్స్ ఈ సమస్యల గురించి సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: