అమరావతి : చంద్రబాబు దెబ్బకు తమ్ముళ్ళు బెదిరిపోతున్నారా ?

Vijaya






వచ్చే ఎన్నికల సంగతి దేవుడెరుగు ఇప్పటికిప్పుడు లక్షల రూపాయలు ఖర్చులు ఎలాగ పెట్టాలిరా దేవుడా అంటు తమ్ముళ్ళు బెదిరిపోతున్నారు. కళ్ళముందు కనబడుతున్న భారీ ఖర్చులను మోయలేక చివరకు చంద్రబాబునాయుడుకే ఎదురుతిరుగుతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవటం చారిత్రక అవసరం. చారిత్రక అవసరం ఎవరికంటే రాష్ట్రానికి కాదు జనాలకూ కాదు. కేవలం చంద్రబాబు, లోకేష్ తో పాటు మరికొంతమంది నేతలకు మాత్రమే.



వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే వాళ్ళ భవిష్యత్తు చాలా దుర్భరంగా తయారవుతుంది. అందుకనే గెలుపు లక్ష్యంగా చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లోమీడియాతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోజూ కథనాలు, వార్తలు రాయిస్తున్నారు. అయినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. దాంతో ఈమధ్య బాగా వివాదాస్పదమైన అన్న క్యాంటిన్లను రాష్ట్రమంతా ఏర్పాట్లు చేయాలని అనుకున్నారట. ప్రభుత్వం అడ్డుకుంటే జనాల్లో సింపతీ వస్తుంది. క్యాంటిన్లను అడ్డుకోకపోతే మరోరకంగా మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారట.




వెంటనే నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలకేంద్రాల్లో  కూడా అన్న క్యాంటిన్లు పెట్టాలని ఆదేశించారట. ప్రతిరోజూ క్యాంటిన్లు నిర్వహించి జనాలకు టిఫెన్, భోజనాలు పెట్టాలని ఆదేశించారట. దాంతో తమ్ముళ్ళందరు తలలు పట్టుకుంటున్నారట. కారణం ఏమిటంటే నిధులు ఎక్కడినుండి తేవాలన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ప్రతిరోజు టిఫెన్లు, భోజనాలంటే ఎంత ఖర్చవుతుందో లెక్కలేసుకుని మరీ గుండెలు బాదుకుంటున్నారట తమ్ముళ్ళు.



నిజానికి టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ ఖర్చుతోనే అన్న క్యాంటిన్లను నిర్వహించలేకపోయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన అన్న క్యాంటిన్ల హామీని 2019 ఎన్నికలకు మరో ఆరునెలలుండగా మాత్రమే ప్రారంభించారు. అంటే అన్నక్యాంటిన్లను చంద్రబాబు కేవలం రాజకీయ లబ్దిగా మాత్రమే చూశారు. అయితే చంద్రబాబు ఆలోచనను పసిగట్టిన జనాలు హోలుమొత్తంమీద ఘోరంగా ఓడించి మూల కూర్చోబెట్టారు. అలాంటిది ఇంతకాలం ఏమీ మాట్లాడని చంద్రబాబు ఎన్నికలకు ముందు హఠాత్తుగా అన్నక్యాంటిన్లంటు హడావుడి మొదలుపెట్టారు. మొన్న తిరుపతిలో అన్నక్యాంటిన్ను ఎవరు పట్టించుకోలేదు. దాంతో చేసేదిలేక తమ్ముళ్ళే రెండోరోజు మూసేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: