పండగకు ముందే కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్..

Satvika
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కస్టమర్లకు గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తుంది.ప్రతి నెల వడ్డీ రేట్లను మారుస్తూ లాభాలను పొందే దిశగా కొత్త వాటిని అమలు చేస్తుంది..అలాగే ప్రతి పండగకు కొత్త ఆఫర్లను అందిస్తుంది.పలు బ్యాంకులు తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించాయి. దేశంలోనే అతిపెద్ద, ప్రభుత్వరంగ ఎస్బీఐ సహా పలు టాప్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచాయి..ఆర్బీఐ ఇటివల పెంచిన రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచాయి. ఆ బ్యాంకులు, వాటి వడ్డీ రేట్లను ఒకసారి చుద్దాము..



ఎఫ్డీ స్కీమ్స్పై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..


ఉత్సవ్ డిపాజిట్' పేరిట ఎస్‌బీఐ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిపాజిట్ ప్లాన్స్‌తో పోల్చితే ఉత్సవ్ డిపాజిట్‌పైనే వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఈ స్కీమ్ కింద 1000 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.10 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటీజన్లు సాధారణ రేటు కంటే అదనంగా 0.50 శాతం వడ్డీని పొందొచ్చు. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ స్కీమ్ వ్యాలిడిటీ కేవలం 75 రోజులు మాత్రమే..


ఆర్‌బీఎల్ బ్యాంక్ ఆకర్షణీయ ఆఫర్..


సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక షార్ట్ -టర్మ్ ఎఫ్‌డీ స్కీమ్‌ని ఆర్బీఎల్ బ్యాంక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త స్కీమ్ కింద 15 నెలల ఎఫ్‌డీపై అదనంగా 0.75 శాతం వడ్డీ రేటుని అందిస్తోంది. అయితే వయసు 80 ఏళ్లు, ఆపైబడినవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే వార్షిక వడ్డీ 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీరేటుతోపాటు పలు ప్రయోజనాలను కూడా డిపాజిటర్లు అందుకోవచ్చు. సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లు ఎలాంటి పెనాల్టీ లేకుండానే ఎఫ్డి లను క్లోజ్ చెయ్యవచ్చు..


బ్యాంక్ ఆఫ్ బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్


75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగా డిపాజిట్ స్కీమ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. అత్యధిక వడ్డీ రేటుతో అందిస్తున్న ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ ఇది. 444 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీపై 5.75 శాతం, 555 రోజుల ఎఫ్‌డీపై 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని పొందొచ్చు. అయితే ఈ స్కీమ్ వ్యాలిడీ ఆగస్టు 16 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు మాత్రమే.రూ.2 కోట్ల లోపు డిపాజిట్ ఉన్నవాల్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది...
దసరా పండుగకు మరికొన్ని బ్యాంక్ లు ఆఫర్లను అందించనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: