పోలీసులకు రక్షణగా పాములు.. ఎక్కడో తెలుసా?

praveen
సాధారణంగా సభ్య సమాజం లో  శాంతి భద్రతలను నెలకొల్పడానికి పోలీస్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు అని చెబుతూ ఉంటారు.  ప్రజలు కూడా తమకు పోలీసుల రక్షణ కల్పిస్తారని హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిద్ర పోతారు అని చెప్పాలి. అయితే అందుకే పోలీసులను రక్షక భటులు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి పోలీసులకి కష్టం వచ్చింది. దీంతో పోలీసులకు రక్షణ కల్పించేందుకు పాములు రంగం లోకి దిగాయి అని చెప్పాలి. చట్టాన్ని అమలు చేసే వారికి పాములే రక్షకులుగా మారి పోయాయ్ అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. పోలీసులకు పాములు రక్షణ కల్పించడం ఏంటి అని అనుకుంటున్నారు కదా..

 ఇలాంటివి జరగడం అసాధ్యం అని అనుకుంటున్నారు కదా.. ఇలా అనుకున్నారంటే మీరు పప్పు లో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. కేరళ లోని హై రేంజ్ ఇడుక్కి పరిధి లోని ఫారెస్ట్ రేంజ్ పోలీస్ స్టేషన్లు పోలీసులకు రక్షణగా పాములు పని చేస్తున్నాయి. కేరళ తమిళనాడు సరిహద్దు లో ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టూ దట్టమైన అడవి ఉంది. అయితే పోలీస్ స్టేషన్ కి కోతుల బెడద కాస్త ఎక్కువ గానే ఉంటుంది.. పోలీసులు వానరాలని ఎంత తరిమి కొట్టిన సమస్య మాత్రం తీరలేదు .
 దీంతో ఒక వినూత్నమైన  ఆలోచన చేశారు పోలీస్ అధికారులు. కోతులను బయటెందుకు రబ్బరు పాములు పెడుతున్నారు.. పోలీస్ స్టేషన్ చుట్టు పక్కల ఇలాంటి రబ్బరు పాములు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. నిజం పాములుగా ఉండే రబ్బరు పాములు కనిపించడం తో  అవి నిజమైన పాములు అనుకుని కోతులు అడ్డు చుట్టుపక్కలకి  కూడా రాకుండా పోతున్నాయి. తద్వారా పోలీసులు చేసిన వినూత్నమైన  ఐడియా ఎంతో పని చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: