హైదరాబాద్ : గీత చేసిన తప్పు ఇదేనా ?

Vijaya






మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ళు జైలుశిక్ష పడిన వార్త చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే జైలుశిక్ష పడటంకాదు. అసలు జైలుశిక్ష పడేంత పరిస్ధితి ఎందుకు వచ్చిందా అన్న విషయంలోనే ఆశ్చర్యమేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో 2014లో బ్యాంకునుండి రు. 42 కోట్ల రూపాయలు తీసుకుని తీర్చకుండా ఎగొట్టిన కేసులో గీతతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకి నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఐదేళ్ళు శిక్ష విధించింది. మాజీ ఎంపీకి సహకరించిన ఇద్దరు బ్యాంకు అధికారులకు కూడా ఐదేళ్ళ శిక్షపడింది.




ఇక్కడ గమనించాల్సిందేమంటే గీత లాగే బ్యాంకులో రుణాలు తీసుకుని ఎగొట్టిన వాళ్ళు ఇంకా చాలామందున్నారు. అలాంటివారిలో కొందరు బీజేపీలో ఎంపీలుగా చెలామణయ్యారు. ఇంకా ఎంపీ పదవుల్లో ఉన్నవారూ ఉన్నారు. రు. 42 కోట్లు ఎగొట్టినందుకే ఐదేళ్ళు జైలుశిక్ష పడితే మరి వేల కోట్లరూపాయలు ఎగొట్టినందుకు వాళ్ళకెన్ని సంవత్సరాలు జైలుశిక్షలు పడాలి. ప్రజాధనం ఎగొట్టిన కేసులో గీతకు ఎందుకు శిక్షపడింది ? మిగిలిన వాళ్ళకు ఎందుకు శిక్షలు పడలేదు ?



దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఏమిటంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా దోచుకున్నవారిలో ఎక్కువమంది బీజేపీలో చేరి యాక్టివ్ గా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని బీజేపీ నేతలుగానో లేకపోతే బీజేపీతో అంటకాగుతున్న వారిపేర్లు అందరికీ తెలుసు కాబట్టే చెప్పటంలేదు. గీత కూడా మిగిలిన వాళ్ళలాగ బీజేపీలో యాక్టివ్ గా ఉండుంటే ఇపుడీ అవస్తలు వచ్చేవి కాదేమో.



గీత చేసిన తప్పు ఏమిటంటే వైసీపీ తరపున గెలిచిన కొద్దికాలంలోనే పార్టీకి దూరమై టీడీపీకి దగ్గరయ్యారు. ఈమధ్య కాలంలోనే మాజీ ఎంపీ పీఎన్బీలో అప్పు తీసుకున్నారు. వైసీపీకి దూరమూన గీత టీడీపీలో చేరటం మొదటితప్పు. టీడీపీలో కాకుండా బీజేపీలో చేరుంటే సరిపోయేది. చివరకు 2019లో బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరినా పెద్దగా యాక్టివ్ గా లేరు. అందుకనే బీజేపీ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఈ కారణంగానే  ఆమెపై విచారణ స్వేచ్చగా జరిగి సీబీఐ కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించగలిగింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: